Winter Health Care: శీతా కాలంలో ఎంత సేపు ఎండలో ఉండాలి? ఏ సమయం మంచిది..
ఎండ అనేది మన జీవనానికి ఎంతో అవసరమైంది. సూర్య రశ్మి వల్ల విటమిన్ - డి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ విటమిన్ - డి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ డి సక్రమంగా అందితే జీర్ణ సమస్యలు అనేవి ఉండవు. అందులోనూ ఉదయం వచ్చే ఎండ చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అదే విధంగా సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిదని అంటారు. సూర్య రశ్మిలో ఉన్నా.. సూర్య నమస్కారాలు చేసినా.. ఎన్నో అనారోగ్య సమస్యలకు..
ఎండ అనేది మన జీవనానికి ఎంతో అవసరమైంది. సూర్య రశ్మి వల్ల విటమిన్ – డి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ విటమిన్ – డి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ డి సక్రమంగా అందితే జీర్ణ సమస్యలు అనేవి ఉండవు. అందులోనూ ఉదయం వచ్చే ఎండ చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అదే విధంగా సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిదని అంటారు. సూర్య రశ్మిలో ఉన్నా.. సూర్య నమస్కారాలు చేసినా.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే ఎండలో ఎంత సేపు ఉండాలి? ఏ సమయంలో ఉంటే మంచిదన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అందులోనూ ఈ శీతా కాలంలో ఎండలో ఖచ్చితంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏ సమయంలో ఉండాలి..
సూర్యోదయం అయిన తర్వాత రెండు గంటల పాటు.. సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు ఎండలో ఉండటానికి అనువైన సమయాలని అంటారు. రోజుకు కనీసం అర గంట సమయం అయినా సూర్య రశ్మిలో ఉండాలని.. అలా కుదరక పోతే పనులు అయినా చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమయంలో అతి నీల లోహిత కిరణాలు.. మనపై నేరుగా పడవు. ఈ సమయం తప్పి.. ఎండలోకి వస్తే ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని బయటకు వెళ్లాలి.
ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..
– ఎండలో ఉండటం వల్ల ముఖ్యంగా శరీరానికి విటమిన్ డి అందుతుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. వెన్నముక, కాళ్లు, కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గుతాయి. అంతే కాకుండా రోజు వారీ పనులు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటాయి.
– ఎండలో కూర్చోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
– అదే విధంగా రోగ నిరోధక శక్తిని, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. దీంతో వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
– రోజూ కాసేపు సూర్య రశ్మిలో ఉండటం వల్ల నిద్ర లేమి సమస్యలు కూడా తగ్గుతాయి. రాత్రిళ్లు హాయిగా నిద్ర పడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటుంది.
– శీతా కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో ఉష్ణోగ్రతలు పడి పోతూ ఉంటాయి. సూర్య రశ్మిలో ఉండటం వల్ల బాడీలో హీట్ పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.