AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonch Attack: పాకిస్తాన్ , చైనా సాయంతో ఉగ్ర కుట్ర.. పూంచ్‌ దాడి ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరం..

మూడేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దులో చైనా-భారత్‌ బలగాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో చైనా బలగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్రీయ రైఫిల్స్‌ను పూంఛ్‌ సెక్టార్‌ నుంచి లద్దాఖ్‌కు తరలించారు. అదే అదనుగా భావించిన పాకిస్థాన్‌ ఉగ్రవాదులను పూంఛ్ సెక్టార్‌లోకి ఉసిగొల్పుతోంది. పూంఛ్‌ అటవీ ప్రాంతంలో దాదాపు 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు నక్కినట్లు అనుమానిస్తున్నారు.

Poonch Attack: పాకిస్తాన్ , చైనా సాయంతో ఉగ్ర కుట్ర.. పూంచ్‌ దాడి ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరం..
In Poonch Attack
TV9 Telugu
| Edited By: Jyothi Gadda|

Updated on: Dec 22, 2023 | 10:01 PM

Share

జమ్ముకశ్మీర్‌ లోని రాజౌరి జిల్లా పూంచ్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనపై NIA దర్యాప్తు కొనసాగుతోంది. సంఘటనా స్థలాన్ని క్షణ్ణంగా పరిశీలించింది NIA బృందం. గెరిల్లా వ్యూహంతో ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసినట్టు గుర్తించారు. ఎత్తైన కొండ ప్రాంతం నుంచి ఆర్మీ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. డేరా కి గలీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్తాన్ , చైనా సైన్యాల సాయంతో ఉగ్రవాదులు ఈ దాడికి కుట్ర పన్నినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేటను ప్రారంభించాయి. రాజోరి ప్రాంతంలో 30 మంది ఉగ్రవాదులు చొరబడినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇప్పటికే అలర్ట్‌ జారీ చేశాయి.

భారత్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ PAFF గా పేరు మార్చుకొని పనిచేస్తోంది. లద్దాఖ్‌ నుంచి భారత బలగాల దృష్టి మరల్చేందుకే పాకిస్తాన్‌ , చైనా కలిసి ఈ దాడికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటన తరువాత పూంచ్‌కు అదనపు బలగాలను తరలించారు.

మూడేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దులో చైనా-భారత్‌ బలగాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో చైనా బలగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్రీయ రైఫిల్స్‌ను పూంఛ్‌ సెక్టార్‌ నుంచి లద్దాఖ్‌కు తరలించారు. అదే అదనుగా భావించిన పాకిస్థాన్‌ ఉగ్రవాదులను పూంఛ్ సెక్టార్‌లోకి ఉసిగొల్పుతోంది. పూంఛ్‌ అటవీ ప్రాంతంలో దాదాపు 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు నక్కినట్లు అనుమానిస్తున్నారు. టెర్రరిస్టుల జాడను పసిగట్టేందుకు స్నిఫర్‌ డాగ్‌లు, డ్రోన్ల సాయంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి తామే పాల్పడినట్టు పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ ప్రకటించుకుంది. పూంఛ్‌ అటవీ ప్రాంతంలో దాక్కున్న వారిని గుర్తించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతోంది. పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ , జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ తోపాటు ఇతర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జమ్ముతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. పాక్‌కు గుణపాఠం చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌ లోని పూంచ్‌లో జవాన్లపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు భారీ కూంబింగ్‌ను చేపట్టాయి. పాకిస్తాన్‌,చైనా కలిసి ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..