- Telugu News Photo Gallery President Droupadi Murmu hosted an At Home reception at Rashtrapati Nilayam, Secunderabad
President Droupadi Murmu: రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం.. కుటుంబ సమేతంగా హాజరైన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి..
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర ద్రౌపది ముర్ము ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.
Updated on: Dec 22, 2023 | 8:29 PM

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర ద్రౌపది ముర్ము ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

ఈ ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను రాష్ట్రపతి ముర్ము ఆప్యాయంగా పలకరించారు.

ఎట్ హోం కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి తదితర ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అంతేకాకుండా హైకోర్టు న్యాయమూర్తులు, సీఎస్, డీజీపీ కూడా ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము అందరినీ ఆత్మీయంగా పలకరించారు.

కాగా.. రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది రేపటితో ముగియనుంది. ముర్ము శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
