AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఏడుకొండలు..ఈ అర్ధరాత్రి నుంచే..

మరోవైపు ముక్కోటి మహోత్సవాలకు భద్రాచలం ఆలయం ముస్తాబయింది. తెప్పోత్సవం సందర్భంగా.. రాములోరు సీతమ్మతో కలిసి హంస వాహనంపై జలవిహారం చేశారు. భద్రాద్రి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి పలువురు తెలంగాణ మంత్రులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవాలయాలు కూడా వైకుంఠ ఏకాదశి పర్వ దినానికి ముస్తాబయ్యాయి. భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి భారీగా బారులు తీరుతున్నారు.

Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఏడుకొండలు..ఈ అర్ధరాత్రి నుంచే..
Tirumala
Jyothi Gadda
|

Updated on: Dec 22, 2023 | 8:54 PM

Share

Vaikunta Dwara Darshanam: తిరుమలలో పది రోజులపాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. అయితే.. ముందుగానే అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి రద్దీ మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తడంతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి.  వైకుంఠ ఏకాదశికి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతాయి. అయితే సర్వ దర్శనానికి భక్తులను నిలిపివేయడంతో తిరుమలలో గందరగోళం నెలకొంది. మరోవైపు ముక్కోటి ఉత్సవాలకు భద్రాద్రి కూడా సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 లక్షలకు పైగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయనుంది టీటీడీ. అయితే టోకెన్ల జారీకి ముందే కౌంటర్ల దగ్గరకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తిరుపతిలో 9 కేంద్రాల్లో 90కి పైగా కౌంటర్లలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. దీనికోసం 1500 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఇక 300 రూపాయల టికెట్లకు సంబంధించి….2.25 లక్షల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ లో ఇప్పటికే భక్తులకు జారీ చేసింది టీటీడీ.

ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడుకొండలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. జనవరి 1 వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతాయి. దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మరోవైపు తిరుమలలో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 16గంటలకు పైగా సమయం పడుతోంది. అటు.. కరోనా మళ్లీ కలకలం రేపుతుండడంతో భక్తులను అప్రమత్తం చేస్తోంది టీటీడీ.

ఇక తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. 31కంపార్టుమెంట్లు నిండడంతో టికెట్లులేని భక్తులను క్యూ లైన్‌లోకి అనుమతించకపోవడంతో…ఏటిసి దగ్గర టిటిడి విజిలెన్స్ సిబ్బందితో భక్తుల వాగ్వాదానికి దిగారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ముక్కోటి మహోత్సవాలకు భద్రాచలం ఆలయం ముస్తాబయింది. తెప్పోత్సవం సందర్భంగా.. రాములోరు సీతమ్మతో కలిసి హంస వాహనంపై జలవిహారం చేశారు. భద్రాద్రి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి పలువురు తెలంగాణ మంత్రులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవాలయాలు కూడా వైకుంఠ ఏకాదశి పర్వ దినానికి ముస్తాబయ్యాయి. భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి భారీగా బారులు తీరుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సరిహద్దులు లేని ప్రేమ! సిసిటివి కెమెరాద్వారా కుమార్తె యోగక్షేమాలు
సరిహద్దులు లేని ప్రేమ! సిసిటివి కెమెరాద్వారా కుమార్తె యోగక్షేమాలు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?