Morning Walk In Winter: చలికాలంలో ఎంతసేపు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?
ఇకపోతే, చలిలో ఉదయాన్నే నిద్రలేవడం కొందరికి కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఉదయం 8.30 నుండి 9.30 మధ్య లేదా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య వాకింగ్‌కు వెళ్లాలని నియమం పెట్టుకోండి. ఈ సమయంలో చలి కాస్త తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కొంతమంది చలికాలంలో వాకింగ్‌కు వెళ్లకపోవడమే ఉత్తమం.. మీకు గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా లేదా న్యుమోనియా ఉన్నట్లయితే, ఉదయాన్నే వాకింగ్ వెళ్లకండి. దీనితో పాటు, వృద్ధులు కూడా శీతాకాలంలో వాకింగ్‌కు వెళ్లకూడదు.
వాకింగ్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. మీ గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడంలో కూడా వాకింగ్ అద్భుతంగా సహయపడుతుంది. అయితే, మార్నింగ్ వాక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, శీతాకాలం వచ్చిందంటే..చాల మంది వాకింగ్ వెళ్లడం మానుకుంటారు. చలిలో కొందరు తెల్లవారుజామున లేవలేక ఇబ్బంది పడుతుంటారు. , కొందరు వెచ్చని దుప్పట్లు కప్పుకుని బెడ్ మీద నుంచి కిందకు దిగాలంటే కూడా బద్ధకిస్తుంటారు. అదే సమయంలో కొంతమంది చలి నుండి తమను తాము రక్షించుకోవడానికి వాకింగ్‌కు వెళ్లకుండా ఉంటారు.
అయితే, మీరు చలికాలంలో వాకింగ్‌కు వెళుతున్నట్లయితే, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాకింగ్ వెళ్లే ముందు మీరు మీ దుస్తుల జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు పూర్తి కప్పుకొని చలికాలంలో వాకింగ్ కోసం బయటకు వెళ్లండి. మంచి వెచ్చని దుస్తులను ధరించండి. తల నుండి కాళ్ల వరకు మిమ్మల్ని మీరు కవర్ చేసుకునేలా చూసుకోండి. మీరు గుర్తుంచుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే, ఉన్నట్టుండి వేగంగా నడవడం లేదంటే పరుగెత్తడం చేయరాదు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నెమ్మదిగా నడవడం ప్రారంభించండి.. ఆ తర్వాత మీరు నడకలో వేగాన్ని పెంచుకోవచ్చు.
ఇకపోతే, చలిలో ఉదయాన్నే నిద్రలేవడం కొందరికి కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఉదయం 8.30 నుండి 9.30 మధ్య లేదా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య వాకింగ్‌కు వెళ్లాలని నియమం పెట్టుకోండి. ఈ సమయంలో చలి కాస్త తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కొంతమంది చలికాలంలో వాకింగ్‌కు వెళ్లకపోవడమే ఉత్తమం.. మీకు గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా లేదా న్యుమోనియా ఉన్నట్లయితే, ఉదయాన్నే వాకింగ్ వెళ్లకండి. దీనితో పాటు, వృద్ధులు కూడా శీతాకాలంలో వాకింగ్‌కు వెళ్లకూడదు.
ఇకపోతే, చలికాలంలో ఎంతసేపు నడవాలి..?
వాస్తవానికి, నిపుణులు ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవాలని సిఫార్సు చేస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ప్రతిఒక్కరూ రోజుకు ఇన్ని వేల అడుగులు నడవాలనే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో, శీతాకాలంలో కనీసం వారానికి 5 రోజులు అరగంట పాటు నడవడానికి ప్రయత్నించండి.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..