Laptop Side Effects: లాప్ టాప్‌ని ఒడిలో పెట్టుకుని వర్క్ చేస్తున్నారా.. మీకు ఆ సమస్యలు తథ్యం..!
లాప్ టాప్స్ వచ్చాక ఎక్కడైనా.. ఎప్పుడైనా వర్క్ చేసుకునే వీలుంది. ఎక్కడికైనా కూడా తీసుకెళ్లి వర్క్ చేసుకోవచ్చు. లాప్ టాప్స్ జీవితాల్లో ఒక భాగం అయ్యాయి. సింపుల్ గా వర్క్ కంప్లీట్ అవుతుంది. లాప్ టాప్స్ తో వర్క్ హోమ్ చేయడం అనేది ఎక్కువగా పెరిగింది. దీంతో ఎక్కువ మంది ఇంట్లోనే లాప్ టాప్స్ తో వర్క్ చేసుకుంటున్నారు. ఇది ఒక రకంగా మంచిదే అయినప్పటికీ.. ఈ గాడ్జెట్ వినియోగించే తీరును బట్టి ఉంటుంది. చాలా మంది లాప్ టాప్ ని ఒడిలో పెట్టుకుని వర్క్ చేస్తూ..

లాప్ టాప్స్ వచ్చాక ఎక్కడైనా.. ఎప్పుడైనా వర్క్ చేసుకునే వీలుంది. ఎక్కడికైనా కూడా తీసుకెళ్లి వర్క్ చేసుకోవచ్చు. లాప్ టాప్స్ జీవితాల్లో ఒక భాగం అయ్యాయి. సింపుల్ గా వర్క్ కంప్లీట్ అవుతుంది. లాప్ టాప్స్ తో వర్క్ హోమ్ చేయడం అనేది ఎక్కువగా పెరిగింది. దీంతో ఎక్కువ మంది ఇంట్లోనే లాప్ టాప్స్ తో వర్క్ చేసుకుంటున్నారు. ఇది ఒక రకంగా మంచిదే అయినప్పటికీ.. ఈ గాడ్జెట్ వినియోగించే తీరును బట్టి ఉంటుంది. చాలా మంది లాప్ టాప్ ని ఒడిలో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా డేంజర్ అని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా వర్క్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు పుట్టడం కష్టం:
ఒడిలో లాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేసే స్త్రీలకు.. పిల్లలు పుట్టడం కష్ట మని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే లాప్ టాప్స్ కి దగ్గరగా పెట్టుకుని వర్క్ చేసే ప్రెగ్నెన్సీ లేడీస్ గర్భస్థ శిశువులపై కూడా ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అదే విధంగా మగ వారు కూడా ఒడిలో లాప్ టాప్ పెట్టుకుని పని చేస్తే.. వారిలో వీర్య కణాల వృద్ధి అనేది తగ్గి పోతుంది. దీని వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గి పోతుంది. కాబట్టి టేబుల్స్ మీద లేదంటే లాప్ టాప్ షీల్డ్ ఉపయోగించినా మంచిది.
చర్మ క్యాన్సర్:
లాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. లాప్ టాప్ ప్రైవేట్ భాగాలకు దగ్గరగా ఉంచడం వల్ల అక్కడ కూడా క్యాన్సర్ రావొచ్చు.. కాబట్టి పలు జాగ్రత్తలు వహించాలి.
మెడ, వెన్ను నొప్పి:
లాప్ టాప్ ని ఒడిలో పెట్టి పని చేయడం వల్ల వండి పని చేయాల్సి ఉంటుంది. దీంతో మెడ, వెన్ను భాగాలు వంగి ఉంటాయి. వీటి వల్ల కూడా ఆ ప్రాంతాల్లో నొప్పి వస్తుంది. ఇలా కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఎఫెక్ట్ పడుతుంది.
రేడియేషన్:
లాప్ టాప్ ల వల్ల ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ను రిలీజ్ చేస్తాయి. వీటిని ఈఎమ్ఎఫ్ అని కూడా పిలుస్తారు. ఈ రేడియేషన్ తో ఆరోగ్యానికి చాలా హానికరం. అంతే కాకుండా ఈ రేడియేషన్ కారణంగా పలు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.