AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తిరుపతి జూలో 23ఏళ్ల సింహం సీత మృతి.. నాలుగు రోజుల క్రితమే మరో సింహం..

సింహం మృతితో సంరక్షకులు, జంతు ప్రేమికులు గంభీరమైన జీవిని కోల్పోయామని అన్నారు. జూ ఆవరణలో దీని గర్జన ఇకపై వినిపించదని ఆవేదనగా చెప్పారు. సీత మృతికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అనురాగ్‌ అనే మగ సింహం చనిపోయింది. ఏడేళ్ల క్రితం జూ పార్క్ లోనే మూడు సింహాలు పుట్టాయి. ఆ మూడు సింహల్లో ఒకటైన మగ సింహానికి అనురాగ్ అనే పెట్టారు.

Andhra Pradesh: తిరుపతి జూలో 23ఏళ్ల సింహం సీత మృతి.. నాలుగు రోజుల క్రితమే మరో సింహం..
Lioness Seetha Passes Away
Jyothi Gadda
|

Updated on: Dec 22, 2023 | 9:14 PM

Share

తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉన్న ఇరవై మూడేళ్ల ఆడ సింహం సీత దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్‌లో శుక్రవారం తుది శ్వాస విడిచింది. జూ క్యూరేటర్ సి సెల్వం తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సీత మృతదేహం నిర్జీవంగా కనిపించింది. కొద్ది రోజుల క్రితం నుంచి సీకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేసినప్పటికీ, అది ఆహారం తినడం మానేయడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పారు. ఈ క్రమంలోనే సీత అనారోగ్యంతో మరణించింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 ఏళ్లని.. వృద్ధాప్యం కారణంగా మృతిచెందినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు.

2001-2002లో సర్కస్ కంపెనీ నుండి SV జూకి తరలించబడిన 82 సింహాలలో సీత కూడా ఉంది. దీని సహచరులు చాలా సంవత్సరాల క్రితమే మరణించాయి. కానీ రెండు దశాబ్దాలుగా ఇక్కడ నివసించిన మూడు సింహాలలో సీత కూడా ఉంది. చాలా తక్కువ సింహాలు మాత్రేమ 20 సంవత్సరాల వయస్సును అధిగమించాయి. ఇది సింహం గరిష్ట సహజ వయస్సును మించిబతికిందని చెప్పారు. సీత కణితి ఇతర వయస్సు సంబంధిత వ్యాధులతో సహా ఆరోగ్య సమస్యలతో పోరాడింది. సింహం మృతితో సంరక్షకులు, జంతు ప్రేమికులు గంభీరమైన జీవిని కోల్పోయామని అన్నారు. జూ ఆవరణలో దీని గర్జన ఇకపై వినిపించదని ఆవేదనగా చెప్పారు. సీత మృతికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అనురాగ్‌ అనే మగ సింహం చనిపోయింది. ఏడేళ్ల క్రితం జూ పార్క్ లోనే మూడు సింహాలు పుట్టాయి. ఆ మూడు సింహల్లో ఒకటైన మగ సింహానికి అనురాగ్ అనే పెట్టారు.

ఇప్పుడు చనిపోయిన సీతను 2001-2002లో 81 ఇతర సింహాలతో పాటు సర్కస్ నుండి SV జూకి తీసుకువచ్చారని జూ సంరక్షకులు వివరించారు. దానిని సాధారణ వైద్య సంరక్షణలో ఉంచామని, దానికి అందించే ఆహారాన్ని కూడా సవరించామన్నారు. కానీ కొన్ని రోజుల క్రితం సింహం సీత ఆహారం తినడం మానేసిందని చెప్పారు. దాంతో సీతకు సంరక్షకులు సూప్‌లు వంటివి అందించారని చెప్పారు. కానీ సింహం అది తినలేకపోయిందన్నారు.

ఇవి కూడా చదవండి

బందిఖానాలో పెంచే ఏ పిల్లి జాతి జీవికైన సగటు ఆయుర్దాయం అరుదుగా 18 నుండి 20 సంవత్సరాలకు మించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అడవిలో ఇలాంటి జంతువుల సగటు జీవితకాలం 12 నుండి 16 సంవత్సరాల మధ్య ఉంటుంది. బాంధవ్‌గఢ్‌లోని రెస్క్యూ సెంటర్‌లో 30 ఏళ్ల వరకు జీవించిన రాజా వంటి దీర్ఘకాలం జీవించిన సింహాల వరుసలో సీత చేరింది. జైపూర్ జంతుప్రదర్శనశాలలో 28 ఏళ్ల వరకు జీవించి 2014లో మరణించిన బాద్షా. రాయ్‌పూర్‌లోని నందన్ వాన్ జూలో, రాజా అనే మరో సింహం 2016లో చనిపోయే ముందు 25 ఏళ్లు జీవించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..