AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: ఈ ప్రత్యేక రైలు సీతా మాతృభూమిని.. అయోధ్యకు కలుపుతుంది..! మరెందరికో ప్రయోజనం..

ఎయిర్‌లైన్స్ కంపెనీ ఇండిగో మొదటి దశలో అయోధ్య నుండి ఢిల్లీ- అహ్మదాబాద్‌లకు విమానాలను ప్రారంభించబోతోందని తెలిసింది. ఇండిగో అయోధ్య విమానాశ్రయం నుండి నడపనున్న మొదటి ఎయిర్‌లైన్‌గా, అయోధ్య విమానయాన సంస్థ 86వ దేశీయ గమ్యస్థానంగా నిలవడం గమనార్హం. ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానంలో 1 గంట 20 నిమిషాల్లో చేరుకుంటారని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది చెబుతున్నారు.

Ayodhya Ram Mandir: ఈ ప్రత్యేక రైలు సీతా మాతృభూమిని.. అయోధ్యకు కలుపుతుంది..! మరెందరికో ప్రయోజనం..
Ayodhya Railway Station
Jyothi Gadda
|

Updated on: Dec 23, 2023 | 5:02 PM

Share

సాంస్కృతిక, చారిత్రిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది అయోధ్య. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిర ప్రాణ ప్రతిష్టా వేడుక దగ్గర పడుతోంది. అతిథులకు స్వాగతం పలికేందుకు అయోధ్యలో బస నుంచి భద్రత వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమం జరగాల్సి ఉండగా, ఆలయ నిర్మాణాన్ని చూసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. రామ మందిరం పట్ల ప్రజల్లో ఉన్న అత్యుత్సాహం చూసి రైల్వే శాఖ ప్రత్యేక అమృత్ భారత్ రైలును నడపాలని నిర్ణయించింది. అంతేకాకుండా అయోధ్యకు బహుమతిగా వందేభారత్ రైలు కూడా అందజేయనున్నారు.

బహుమతిగా వందే భారత్ రైలు:

రామాలయం ప్రారంభోత్సవానికి ముందు, రైల్వే ప్రత్యేక అమృత్ భారత్ రైలును ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ రైలు అయోధ్య రామ జన్మభూమి నుండి తల్లి సీతాదేవీ జన్మస్థలం మీదుగా దర్భంగా చేరుకుంటుంది. అయోధ్య, దర్భంగా మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు నాన్-ఏసీ, స్లీపర్ క్లాస్ అని సమాచారం. డిసెంబర్ 30న అమృత్ భారత్ రైలుతో పాటు అయోధ్యలో వందేభారత్ రైలును కూడా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

అందుబాటులో రవాణా సౌకర్యాలు:

అయోధ్యకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్ మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం రైల్వేశాఖ రూ.240 కోట్లు వెచ్చించింది. రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ 10 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. అయోధ్య రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత అందమైన, ఆధునిక సౌకర్యాలు కలిగిన రైల్వే స్టేషన్లలో ఒకటిగా ఉండనుంది.

విమానాశ్రయంలో ట్రయల్ రన్ జరిగింది:

డిసెంబర్ 30న అయోధ్యలో రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అలాగే అయ్యోధలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా డిసెంబర్ 30న ప్రారంభించనున్నారు. అదే రోజు డిసెంబరు 30న ఢిల్లీ నుంచి తొలి విమానం ఈ విమానాశ్రయంలో దిగనుంది. డిసెంబర్ 30న ప్రారంభోత్సవానికి ముందు, అంతకుముందు డిసెంబర్ 22న అయోధ్య విమానాశ్రయంలో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.

ఎయిర్‌లైన్స్ కంపెనీ ఇండిగో మొదటి దశలో అయోధ్య నుండి ఢిల్లీ- అహ్మదాబాద్‌లకు విమానాలను ప్రారంభించబోతోందని తెలిసింది. ఇండిగో అయోధ్య విమానాశ్రయం నుండి నడపనున్న మొదటి ఎయిర్‌లైన్‌గా, అయోధ్య విమానయాన సంస్థ 86వ దేశీయ గమ్యస్థానంగా నిలవడం గమనార్హం. ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానంలో 1 గంట 20 నిమిషాల్లో చేరుకుంటారని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..