Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: పాముతో ముంగిస భీకర యుద్ధం.. ఎవరు గెలిచారో మీరే చూడండి..

కొన్ని జంతువులకు సంబంధించిన అందమైన వీడియోలు, కొన్ని భయానక వీడియోలు కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇక్కడ పాము, ముంగిస మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందించారు. కొందరు భయంకరంగా ఉందంటే..మరికొందరు షాకింగ్‌గా ఉందంటున్నారు.

Watch Viral Video: పాముతో ముంగిస భీకర యుద్ధం.. ఎవరు గెలిచారో మీరే చూడండి..
Snake And Mongoose Fighting
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 23, 2023 | 7:24 PM

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. చాలా మంది రాత్రికి రాత్రే ఫేమస్‌ కావటం కోసం అనేక రకాలైన వీడియోలను షేర్‌ చేస్తుంటారు. ఈ వీడియోలలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని జంతువులకు సంబంధించిన అందమైన వీడియోలు, కొన్ని భయానక వీడియోలు కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇక్కడ పాము, ముంగిస మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందించారు. కొందరు భయంకరంగా ఉందంటే..మరికొందరు షాకింగ్‌గా ఉందంటున్నారు.

ముంగిస, పాము మధ్య శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఈ రెండు జంతువులు ఒకదానికొకటి ఎదురుగా వచ్చినప్పుడు, అవి ఘర్షణ పడటం ఖాయం. ముంగిస, పాము మధ్య ఇలాంటి భీకర పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ప్రజలు ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలను షేర్‌ చేస్తుంటారు. చూస్తుంటారు. ప్రస్తుతం పాములు, ముంగిసలకు సంబంధించిన ఇలాంటి వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.. పాములు, ముంగిసల మధ్య శత్రుత్వం గురించి మీరందరూ వినే ఉంటారు. ఆ రెండు ఒకచోట కలిసి జీవించలేవు. అందుకే ఇద్దరు వ్యక్తులు ఒకేలా తగాదాలు పడినా పాము, ముంగిసల పోరుతో పోలుస్తారు. ఈ వైరల్ వీడియో కూడా వీరిద్దరి మధ్య జరిగిన పోరాటానికి సంబంధించినదే. చూద్దాం ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారో..

ఇవి కూడా చదవండి

చివరికి గెలిచేది ఎవరు?

ముంగిసకు, పాముకి మధ్య జరిగిన ఈ గొడవ రోడ్డు పొడవునా సాగింది. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లుగా, రోడ్డు పక్కన పాము పడుకుని ఉంది. అంతలోనే ఒక ముంగిస రోడ్డు దాటి అటువైపుగా నడుస్తుంది. ముంగిస సమీపిస్తుండగా పాము దానిపై దాడి చేస్తుంది. పాము రెండుసార్లు ముంగిసపై దాడికి యత్నించినా ఫలించలేదు. ముంగిసపై ఎలాంటి ప్రభావం పడలేదు. ముంగిస పాము చుట్టూ తిరుగుతూ సరైన అవకాశంతో పాముపై దాడి చేస్తుంది. పాము తోకను నోటిలో పట్టుకుని పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. అలా ధైర్యవంతమైన ముంగిస పామును వేటాడింది. ఈ వీడియో ఇప్పటివరకు చాలా మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.

ఈ వీడియో bilal_aakil_vlogs పేరుతో Instagram ఖాతాలో షేర్‌ చేయబడింది. ఈ వీడియో చూస్తే మీకే వణుకు పుడుతుంది. చాలా మంది వినియోగదారులు వీడియోపై వ్యాఖ్యానించకుండా తమను తాము కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నాం అంటున్నారు.. కొంతమంది వినియోగదారులు పామును పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. మరికొందరు ముంగిసను ధైర్యం గల జీవి అం టూ పిలిచారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..