Gold Price Today: వామ్మో బంగారం.. మళ్లీ పెరిగిన ధర. తులం ఎంతకు చేరిందో తెలిస్తే..
తాజాగా ఆదివారం కూడా బంగారం ధర పెరిగింది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 260 పెరిగింది. దీంతో దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200కి చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర ఏకంగా రూ. 63,490కి ఏగబాకింది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ ధర పెరగడమే తప్ప తగ్గడం లేదు. తగ్గడం కంటే పెరగడమే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉన్న నేపథ్యంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా బంగారం ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. శనివారం బంగారం ధరలో పెరుగుదల కనిపించగా..
తాజాగా ఆదివారం కూడా బంగారం ధర పెరిగింది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 260 పెరిగింది. దీంతో దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200కి చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర ఏకంగా రూ. 63,490కి ఏగబాకింది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,640కి చేరింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,490గా నమోదైంది. ఇక చెన్నైలో ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 64,090 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,490 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,490 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తగ్గిన వెండి ధర..
ఓవైపు బంగారం ధర పెరిగితే వెండి ధరలో మాత్రం తగ్గుదల కనిపించింది. ఆదివారం కిలో వెండిపై రూ. 500 వరకు తగ్గింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ. 79,000 వద్ద కొనసాగుతోంది. ఒక చెన్నై, కేరళలో అత్యధికంగా రూ. 80,500 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..