AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం బంపర్ ఆఫర్..!

సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం తగిన చట్టాలను తయారు చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం బంపర్ ఆఫర్..!
Telangana Cm Revanth Reddy
Sravan Kumar B
| Edited By: Jyothi Gadda|

Updated on: Dec 23, 2023 | 8:45 PM

Share

క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 4 నెలల క్రితం స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు సీఎం.

సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.

“సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా.. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.. గివ్ అండ్ టేక్ పాలసీ ని పాటించని ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. 4 నెలల క్రితం స్విగ్గి బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందిస్తారని ఆనాడు చూశామననారు.. కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో మానవత్వంతో వ్యవహరించాలన్నారు. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్కడ దరఖాస్తుల్లో వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చునని చెప్పారు.  ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రెటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..