AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakatiya University: ఆ వర్సిటీలో ఏం జరిగింది.? ఎందుకు 81 మంది అమ్మాయిలపై సస్పెన్షన్ వేటు వేశారు.?

వరంగల్‎లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా 81 మంది విద్యార్థినిలు సస్పెండ్ అయ్యారు. వారిని హాస్టల్‎తోపాటు తరగతుల నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కేయూ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగింది.? ఎందుకు వారిని సస్పెండ్ చేశారు.? ఎందుకు వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Kakatiya University: ఆ వర్సిటీలో ఏం జరిగింది.? ఎందుకు 81 మంది అమ్మాయిలపై సస్పెన్షన్ వేటు వేశారు.?
Kakateya University
G Peddeesh Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 25, 2023 | 12:25 PM

Share

వరంగల్‎లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా 81 మంది విద్యార్థినిలు సస్పెండ్ అయ్యారు. వారిని హాస్టల్‎తోపాటు తరగతుల నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కేయూ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగింది.? ఎందుకు వారిని సస్పెండ్ చేశారు.? ఎందుకు వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సస్పెండ్ అయిన వారిలో 28 మంది పీజీ విద్యార్థినిలు, 28 మంది ఎకనామిక్స్- కామర్స్ విద్యార్థినిలు, 25 మంది జువాలజీ విద్యార్థినిలు ఉన్నారు. వీరంతా సీనియర్ విద్యార్థులు.. పద్మాక్షి హాస్టల్‎లో ఆశ్రయం పొందుతూ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలపై సస్పెండ్ చేశారు కాలేజి యాజమాన్యం.

జూనియర్ అమ్మాయిలను ఏడిపించి పైశాచిక ఆనందం పొందారు. హాస్టల్ గదిలో వారిచేత పాటలు పాడించి, డ్యాన్సులు చేయించారు. చెప్పిన మాట వినని జూనియర్ విద్యార్థుల చేత గుంజీలు తీయించారు. వీళ్ళ పైశాచిక ఆనందం మితిమీరిపోవడంతో బాధిత విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కేయూ వైస్ ఛాన్స్‎లర్‎కు బాధిత విద్యార్థులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కే యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ఆ కమిటీ ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించి నివేదిక సమర్పించింది. ప్రొఫెసర్స్ కమిటీ నివేదిక ఆధారంగా 81 మంది విద్యార్థినిలపై చర్యలు తీసుకున్నారు. వారిని వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. వారి పేరెంట్స్‎కు సమాచారం అందించారు. ఐతే అమ్మాయిలు ర్యాగింగ్ కు పాల్పడడం, వారి పై వర్సిటీ పాలక వర్గం చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. ర్యాగింగ్‎కు పాల్పడిన వారు ఆడవారైనా, మగ వారైనా ఒకే విధమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపిన వైస్ ఛాన్సలర్.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..