AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Party: తెలంగాణ భవన్‎లో “స్వేద పత్రం’ వాయిదా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎప్పుడంటే..

తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మొన్నటి వరకూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విమర్శలు, మాటల తూటాలు విసురుకున్న నాయకులు గత కొంత కాలంగా నిశ్శబ్ధాన్ని పాటించారు. అయితే అసెంబ్లీ వేదికగా మరోసారి తమ విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు పార్టీ నాయకులు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి అధికార కాంగ్రెస్ గత పాలకుల పనితీరుపై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామని చెప్పింది.

BRS Party: తెలంగాణ భవన్‎లో స్వేద పత్రం' వాయిదా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎప్పుడంటే..
MLA KTR
Srikar T
|

Updated on: Dec 23, 2023 | 5:14 PM

Share

తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మొన్నటి వరకూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విమర్శలు, మాటల తూటాలు విసురుకున్న నాయకులు గత కొంత కాలంగా నిశ్శబ్ధాన్ని పాటించారు. అయితే అసెంబ్లీ వేదికగా మరోసారి తమ విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు పార్టీ నాయకులు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి అధికార కాంగ్రెస్ గత పాలకుల పనితీరుపై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామని చెప్పింది. అసెంబ్లీ వేదికగా విద్యుత్‎పై శ్వేతపత్రాలన్ని విడుదల చేసింది. దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే రెండు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దీంతో ఈనెల 23న తెలంగాణ భవన్‎లో స్వేద పత్రం విడుదల చేస్తామని ప్రకటించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో భాగంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈరోజు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది.

గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్దిని, సంక్షేమాన్ని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్ ఏం చెబుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఏం జరిగిందో తెలియదు.. ఉన్నపళంగా స్వేద పత్రం కార్యక్రమం వాయిదా పడింది. శనివారం బదులు ఆదివారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

దీనిపై మాజీ మంత్రి తన ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం’ అని రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..