AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఈ ఎమ్మెల్యే చెప్పిన మాటకు సీఎం జగన్ షాక్.. అసలు ఏమన్నారంటే..

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే మార్పు తప్పదని అధినేత జగన్ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు కూడా. ఆ నియోజకవర్గంలో ఏడాదికి పైగా ఎమ్మెల్యేని మార్చాల్సిందేనంటూ అసమ్మతి వర్గం పట్టుబడుతోంది. ఈ పంచాయతీ కాస్త సీఎం దాకా వెళ్ళింది. ఎమ్మెల్యేకి కూడా సీఎం గట్టిగానే చెప్పారు.. అయినా పరిస్థితి మారలేదు. దీంతో బహిరంగంగానే తమ వాయిస్ పెంచింది అసమ్మతి వర్గం. దీంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడింది.

CM Jagan: ఈ ఎమ్మెల్యే చెప్పిన మాటకు సీఎం జగన్ షాక్.. అసలు ఏమన్నారంటే..
Sullurpet Mla Sanjeevaiah
Ch Murali
| Edited By: Srikar T|

Updated on: Dec 23, 2023 | 3:54 PM

Share

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే మార్పు తప్పదని అధినేత జగన్ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు కూడా. ఆ నియోజకవర్గంలో ఏడాదికి పైగా ఎమ్మెల్యేని మార్చాల్సిందేనంటూ అసమ్మతి వర్గం పట్టుబడుతోంది. ఈ పంచాయతీ కాస్త సీఎం దాకా వెళ్ళింది. ఎమ్మెల్యేకి కూడా సీఎం గట్టిగానే చెప్పారు.. అయినా పరిస్థితి మారలేదు. దీంతో బహిరంగంగానే తమ వాయిస్ పెంచింది అసమ్మతి వర్గం. దీంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడింది. అక్కడ మార్పు తప్పదన్న భావనకు వచ్చింది. అదే విషయం ఆ ఎమ్మెలేకు చెప్పారు సీఎం జగన్. కానీ ఆ ఎమ్మెల్యే చెప్పిన కారణం విన్న జగన్‎కు ఒక్క నిముషం ఏం అర్ధం కాలేదట.

దశాబ్దం కిందటి వరకు టిడిపికి కంచుకోట లాంటి నియోజకవర్గం.. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో స్థానంలో మెజారిటీ సాధించిన నియోజకవర్గం సూళ్లూరుపేట. ఇక్కడి నుంచి కిలివేటి సంజీవయ్య రెండుసార్లు వైసీపీ తరపున విజయం సాధించారు. 63 వేల మెజారిటీతో రాష్ట్రంలోనే అత్యధికంగా మూడో స్థానంలో ఓట్లు సాధించారు. మెజారిటీ లాగా వ్యతిరేకతలో కూడా జిల్లాల్లో టాప్‎లో ఉన్నారు సంజీవయ్య. నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన వారిని పట్టించుకోవడం లేదన్నది వ్యతిరేక వర్గం ఆరోపణ. అంతటితో ఆగక.. సొంత పార్టీ నేతలపైనే పోలీసులతో కొట్టించిన ఎమ్మెల్యేగా ఆరోపణలు చేస్తోంది అసంతృప్తి వర్గం. పార్టీలో ముందు నుంచి ఉన్న సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి, సీనియర్ నేత సుధాకర్ రెడ్డి, ఓడూరు గిరిధర్ రెడ్డి, మరికొందరు సంజీవయ్య‎పై అధిష్టానానికి అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. తమకు కావాల్సిన వారికి ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలతో నియోజకవర్గంలో రచ్చ పీక్స్‎కు చేరింది.

ఇటీవల నాయుడు పేటలో అసంతృప్తి వర్గానికి చెందిన రాకేష్ రెడ్డిపై ఎమ్మెల్యే వర్గం కరెంట్ పోల్‎కు కట్టేసి మరీ తీవ్రంగా దాడి చేశారని రీజినల్ కోర్దినేటర్ విజయ సాయి రెడ్డికి ఫిర్యాదులు చేశారు. అలాగే పలు సందర్భాల్లో సీఎం జగన్ కూడా సూళ్లూరుపేట పరిస్థితులపై ఎమ్మెల్యే సంజీవయ్య‎కు సర్దుకుపోవాలని కూడా చెప్పినట్లు సమాచారం. అందరిని కలిసి, కలుపుకు పోవాలని చెప్పినా మా పట్ల ఎమ్మెల్యే వైఖరి మారలేదని అధిష్టానానికి మళ్ళీ ఫిర్యాదులు. దీంతో సయోధ్య కుదరలేదు కదా ఇక్కడ గొడవ నెక్ట్స్ లెవల్ కు చేరుకుంది. ఎమ్మెల్యే అసంతృప్తి వర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. జగనన్న ముద్దు సంజీవయ్య వద్దు అనే నినాదంతో సమావేశం జరిగింది. ఆ వెంటనే ఎమ్మెల్యే అనుకూల వర్గం కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి అసంతృప్తి వర్గంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమాలకు పాల్పడే వారు, గుట్కా వ్యాపారులు కూడా నీతులు చెబుతున్నారని టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే సంజీవయ్య‎ను తిరుపతి జిల్లాలోని సత్యవేడుకు పంపాలన్న యోచనలో ఉన్న అధిష్టానం తిరుపతి ఎంపీ గురుమూర్తిని సూళ్లూరుపేటకు పంపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం జగన్‎ను కలిశారు ఎమ్మెల్యే సంజీవయ్య. “నీకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అందుకే నువ్వు ఈసారి సత్యవేడు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది అని చెప్పారట. వెంటనే ఎమ్మెల్యే సంజీవయ్య సార్ నాకు తమిళం రాదు కాబట్టి నేను అక్కడ పోటీ చేయలేనని చెప్పారట. ఆ మాట వినగానే అధినేత జగన్‎కు అర్ధం కాలేదు.. ఎందుకు అని అడగగా తిరుపతి జిల్లాలో ఉన్న సత్యవేడు తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా వాడుక భాష తమిళం ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడ ఎన్నికల్లో నిలబడాలంటే తమిళం వచ్చి ఉండాలి. ప్రచారం, ఓటర్లతో మాట్లాడడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పారట”. దీంతో చూద్దాం.. పరిస్థితి చక్కబడేలా మాట్లాడుదాం అని చెప్పి పంపారట సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..