Black Cobra: పాము కాటుకు బలైన పసిపాప.. తీవ్ర వేదనకు గురైన కుటుంబ సభ్యులు..

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పసిపాపను నాగు పాము కాటు వేసింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏ పాపం తెలియని చిన్నారి ఆయువు పసి ప్రాయంలోనే క్షీణించింది. పదిమందితో ఆడుకోవల్సిన పాప విగతజీవిలా పడిపోయింది. ముక్కుపచ్చలు ఆరని పసిపాప విష సర్పానికి బలైంది. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామంలో బోయ రవి అనే వ్యక్తి పాప ఇంటి ముందు ఆడుకుంటోంది.

Black Cobra: పాము కాటుకు బలైన పసిపాప.. తీవ్ర వేదనకు గురైన కుటుంబ సభ్యులు..
Kurnool
Follow us

|

Updated on: Dec 23, 2023 | 4:25 PM

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పసిపాపను నాగు పాము కాటు వేసింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏ పాపం తెలియని చిన్నారి ఆయువు పసి ప్రాయంలోనే క్షీణించింది. పదిమందితో ఆడుకోవల్సిన పాప విగతజీవిలా పడిపోయింది. ముక్కుపచ్చలు ఆరని పసిపాప విష సర్పానికి బలైంది. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామంలో బోయ రవి అనే వ్యక్తి పాప ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న నాగుపాము పాపను కాటు వేసింది. కాలి వేళ్ల దగ్గర పాము కాటుకు గురైన చిన్నారి పెద్ద కేరింతలుపెడుతూ ఏడుస్తుండటంతో పాప తల్లి బయటకు వెళ్లి చూశారు.

పాప ఎదురుగా ఉన్న బండ రాళ్ళను తొలగించి చూడగా అక్కడ రెండు నాగుపాములు కనిపించాయి. అందులో ఒకటి నల్ల నాగుపాము కాగా.. మరొకటి శ్వేత నాగుగా గుర్తించారు. ఈ రెండు పాములను పాప బంధువులు చంపేశారు. వెంటనే పాపను అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. హాస్పిటల్‎కి తరలించే మార్గం మధ్యలోనే పసిపాప మృతి చెందింది. దీంతో ఆ తల్లి ప్రాణ సంకటం వర్ణణాతీతం. చిన్నారి తండ్రి బోయ రవితోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర రోధనకు గురయ్యారు. పాప లేని లోటును జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే నల్ల నాగులు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ అరుదైన శ్వేత నాగు కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..