PV Narasimha Rao: దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన పీవీ నరసింహా రావు వర్ధంతి సంద‌ర్భంగా ఘన నివాళి..

పీవీ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

PV Narasimha Rao: దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన పీవీ నరసింహా రావు వర్ధంతి సంద‌ర్భంగా ఘన నివాళి..
Tribute To Pv Narasimha Rao
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 23, 2023 | 2:42 PM

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని అన్నారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. పీవీ ఘాట్‌లో ఘన నివాళులర్పించారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌. పీవీ నర్సింహరావు… కరీంనగర్‌ మట్టి బిడ్డ.. ముద్దు బిడ్డ అంటూ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఇక ఢిల్లీలో జరిగిన పీవీ నరసింహారావు 19వ వర్థంతి కార్యక్రమాంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఆయనను దేశానికి ప్రధానమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీని కాంగ్రెస్ ప్రధానిని చేసిందని గుర్తు చేశారు. పీవీ వర్థంతి సందర్భంగా పత్రికా ప్రకటనలు ఇవ్వాలని వి హనుమంతరావు ప్రభుత్వానికి సూచించారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!