AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court judgment: బాలికపై అత్యాచారంలో కేసులో సంచలన తీర్పు.. యువకుడికి 60 ఏళ్ల జైలు శిక్ష..!

కామాంధుడికి కఠిన శిక్ష విధించింది న్యాయస్థానం. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి 60ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 2012లో జరిగిన ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల మహిళా, ప్రజాసంఘాలు హార్షం వ్యక్తం చేశాయి.

Court judgment: బాలికపై అత్యాచారంలో కేసులో సంచలన తీర్పు.. యువకుడికి 60 ఏళ్ల జైలు శిక్ష..!
Life Sentence
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 23, 2023 | 12:39 PM

Share

మదమెక్కిన కామాంధుడికి కఠిన శిక్ష విధించింది న్యాయస్థానం. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి 60ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 2012లో జరిగిన ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల మహిళా, ప్రజాసంఘాలు హార్షం వ్యక్తం చేశాయి.

సూర్యాపేట జిల్లాకు చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఉపాధి కోసం నల్లగొండ పట్టణానికి వచ్చారు. నల్లగొండ మున్సిపల్ పరిధిలోని ఆర్జాలబావిలో నివాసం ఉంటూ కూలీ నాలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సెంట్రింగ్‌ పని చేసే చిట్యాలకు చెందిన నిజాముద్దీన్‌ అలియాస్‌ నిజ్జు వీరి ఇంటి పక్కనే అద్దె ఉన్నాడు. మైనర్ బాలికకు చాక్లెట్లు కొనిస్తూ, సెల్‌ ఫోన్‌ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు ఇళ్లు ఖాళీ చేసి, వేరే చోట కిరాయి తీసుకున్నారు. అయినప్పటికీ నిజాముద్దీన్‌ తన బుద్ధి మార్చుకోకుండా తల్లిదండ్రులు లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పొద్దని బాలికను బెదిరించాడు.

అయితే కొద్ది రోజులకు కడుపునొప్పి భరించలేక బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వైద్యుల పరీక్షలు చేయగా, గర్భవతి అని తేలింది. దీంతో 2012 డిసెంబర్ లో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై నల్గొండ రూరల్ ఎస్సై కంచర్ల భాస్కర్ రెడ్డి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, అప్పటి సీఐ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తును అన్ని సాంకేతిక ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. తాజాగా ఈ కేసును విచారించి నల్గొండ జిల్లా మొదటి అదనపు సెషన్ కోర్టు జడ్జి తిరుపతి.. నిందితుడిపై నేరారోపణ రుజువైనట్టు ప్రకటిస్తూ 60 సంవత్సరల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.

అలాగే నేరస్తుడికి 60 సంవత్సరాల జైలు శిక్షను ఏకకాలంలోనే 20 ఏళ్లు జైల్లో నిర్భంధించేలా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం, నిందితుడు సైతం రూ.60 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందుడికి కఠిన శిక్షపడేలా పని చేసిన పోలీసులను, న్యాయవాదులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ తీర్పు పట్ల మహిళా, ప్రజాసంఘాలు హార్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…