AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airport Authorities: ఎయిర్‎ పోర్ట్‎లో పట్టుబడిన అందమైన అనకొండలు.. అక్రమంగా తరలించిన వ్యక్తి అరెస్ట్..

మన దేశంలో ఏదో ఒక మూల అక్రమ రవాణా జరుగుతూనే ఉంటుంది. అది మద్యం రూపంలో, బంగారం రూపంలో, నగదు రూపంలో జరగడం చూసే ఉంటాం. అయితే తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి తొమ్మిది రకరకాల కొండచిలువలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు మొక్కజొన్న రంగులో ఉన్న పాములను పట్టుకున్నట్లు శుక్రవారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు వెల్లడించారు.

Airport Authorities: ఎయిర్‎ పోర్ట్‎లో పట్టుబడిన అందమైన అనకొండలు.. అక్రమంగా తరలించిన వ్యక్తి అరెస్ట్..
Ball Pythons And Corn Snakes Seize
Srikar T
|

Updated on: Dec 23, 2023 | 5:55 PM

Share

మన దేశంలో ఏదో ఒక మూల అక్రమ రవాణా జరుగుతూనే ఉంటుంది. అది మద్యం రూపంలో, బంగారం రూపంలో, నగదు రూపంలో జరగడం చూసే ఉంటాం. అయితే తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి తొమ్మిది రకరకాల కొండచిలువలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు మొక్కజొన్న రంగులో ఉన్న పాములను పట్టుకున్నట్లు శుక్రవారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు వెల్లడించారు. పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో నిఘా కట్టుదిట్టం చేసిన ముంబై స్మగ్లింగ్ నిరోధక సంస్థ జోనల్ యూనిట్ అధికారులు బుధవారం బ్యాంకాక్‎లో బయలుదేరి ముంబై సిటీ విమానాశ్రయానికి చేరుకున్న ఒక వ్యక్తిని అడ్డుకున్నారు. అతని లగేజీని తనిఖీ చేసినట్లు తెలిపారు.

అతని చెక్-ఇన్ లగేజీని పరిశీలించిన సమయంలో, అధికారులు బిస్కెట్, కేక్ ప్యాకెట్లలో దాచిపెట్టిన తొమ్మిది కొండచిలువలు, రెండు మొక్కజొన్న రంగులో ఉన్న పాములు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న వన్యప్రాణులను కస్టమ్స్ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు తనిఖీ అధికారి తెలిపారు. తరువాత, కొందరు వ్యక్తులు అన్యదేశ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నట్లు నవీ ముంబైలోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యుసిసిబి) అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారుల తనీఖీల్లో పట్టుబడిన కొండచిలువలు, వివిధ జాతుల పాములు దేశీయ జాతులు కావని, వాటిని ఇక్కడి చట్టాలను ఉల్లంఘించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడకు తీసుకువచ్చారని ఆయన చెప్పారు.

అవి పెరిగిన వాతావరణ పరిస్థితులు మన దేశంలో అందుబాటులో ఉండదని.. వాటి మెరుగైన మనుగడ కోసం పట్టుకున్న పాములను తిరిగి బ్యాంకాక్‌కు పంపాలని డబ్ల్యుసిసిబి ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ డిటెన్షన్-కమ్-డిపోర్టేషన్ ఆర్డర్‌ను జారీ చేశారు. అంటే స్వదేశంలో పట్టుకున్న వస్తువులను, ప్రాణులను తిరిగి వాటి గమ్యస్థానాలకు చేర్చడం అనమాట. ఈ సర్పాలను తీసుకొచ్చిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..