AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి

ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని... తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా..

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి
Road Accident
Subhash Goud
|

Updated on: Dec 23, 2023 | 7:06 AM

Share

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, ఓవర్‌టెక్‌, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎందరో బలవుతున్నారు. ఇక తాజాగా శనివారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపుంర జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రాక్టర్ ను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు.

కాగా, ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని… తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వోల్వో బస్సు ఢీకొనడంతో బియ్యం బస్తాలు సైతం రోడ్డు దాటి ఎగిరిపడ్డాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా అతివేగంతో ఓల్వో బస్సు ఢీకొనటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్న స్థానికులు.

Follow Us
అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల ధరలు పెరిగాయ్..
నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల ధరలు పెరిగాయ్..
ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు 2026: శ్రావణ మాస విశేషాలతో పూర్తి..
ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు 2026: శ్రావణ మాస విశేషాలతో పూర్తి..
నాటు కోడి స్టైల్‌లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు
నాటు కోడి స్టైల్‌లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు
విజయ్ దళపతి కొడుకు ఫస్ట్ రియాక్షన్.. ఆకట్టుకుంటున్న మాటలు..
విజయ్ దళపతి కొడుకు ఫస్ట్ రియాక్షన్.. ఆకట్టుకుంటున్న మాటలు..
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? - జిడ్డు కృష్ణమూర్తి
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? - జిడ్డు కృష్ణమూర్తి
రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా
రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా
916 రేటింగ్ పాయింట్లతో చరిత్ర.. టీ20ల్లో ఈషాన్ కొత్త రికార్డ్
916 రేటింగ్ పాయింట్లతో చరిత్ర.. టీ20ల్లో ఈషాన్ కొత్త రికార్డ్
హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. ఇది కదా కావాల్సింది..
హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. ఇది కదా కావాల్సింది..
చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..
చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..