AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు..

కోలీవుడ్ స్టార్ , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఇప్పుడు దర్శకుడిగా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సంజయ్ తెరకెక్కిస్తున్న సినిమా సిగ్మా. ఈ మూవీని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేసన్ సంజయ్.. మొదటి సారి తన వ్యక్తిగత, ఫ్యామిలీ విషయాలు పంచుకున్నారు.

Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు..
Jason Sanjay
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2026 | 5:13 PM

Share

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సంజయ్ తెరకెక్కిస్తున్న సినిమా సిగ్మా. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరి క్షణంలో వాయిదా పడింది. ఇదెలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్.. తన లైఫ్, సినీ కెరీర్ గురించి ఆసక్తకిర విషయాలు పంచుకున్నారు. అలాగే తన గురించి.. తన కుటుంబం గురించి వచ్చిన కామెంట్స్ పట్ల రియాక్ట్ అయ్యారు. తాను సినిమా లేదా కుటుంబంపై వచ్చే వ్యాఖ్యలను తాను చదువుతానని, వాటిని ఎలా స్వీకరిస్తున్నారో గమనిస్తానని ఆయన వెల్లడించారు. ప్రతి వ్యాఖ్యకూ ఒక ప్రయోజనం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కొందరు ప్రోత్సహించడానికి వ్యాఖ్యలు చేస్తే, మరికొందరు సృజనాత్మక సూచనలు ఇస్తారని, వాటిని తాను గౌరవిస్తానని తెలిపారు. ఎందుకంటే, ప్రజల కోసమే తాము సినిమాలు చేస్తామని జేసన్ సంజయ్ అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

అదే సమయంలో, కొందరు వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని, తమను వ్యక్తిగతంగా తెలియకుండానే కొన్ని కథనాలను సృష్టిస్తారని ఆయన పేర్కొన్నారు. వారి మనసులో ఒక కథను రాసుకుని, ఒక సమస్యను ఊహించుకుని, దానికి ఒక అభిప్రాయాన్ని జోడించి వ్యాఖ్యానిస్తారని ఆయన వివరించారు. ప్రజలు తరచుగా ఇతరులను గమనించి ఊహించుకుంటారని, ఇది కొన్నిసార్లు తమ నియంత్రణకు మించి జరుగుతుందని జేసన్ సంజయ్ అన్నారు. అటువంటి కామెంట్స్ చదివినప్పుడు, వారు తన గురించి తెలియదని, వారి ఆలోచనలు ఇలా ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

భవిష్యత్తులో తన సినిమాను ప్రచారం చేయడానికి లేదా ప్రజలతో బహిరంగంగా మాట్లాడే అవకాశం లభిస్తే, ప్రజలు తనను ఎవరో తెలుసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఏదైనా బద్దలు కొట్టాలని లేదా వేరే కథనాన్ని సృష్టించాలని ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. తాను తానుగా ఉంటే, ప్రజలు తనను అర్థం చేసుకుంటారని జేసన్ సంజయ్ వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

Follow Us