AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో నిజంగానే పిచ్చి కొట్టుడు కొట్టాడు.. ఆ దెబ్బలకు నాకు జ్వరం వచ్చింది

ప్రముఖ హాస్యనటుడు ప్రభాస్ శ్రీను తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కామెడీ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. నెగిటివ్ పాత్రలు చేస్తూనే కామెడీని కూడా పండించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్ శ్రీను. స్టార్ హీరోల సినిమాల్లో నటించారు ప్రభాస్ శ్రీను..

ఆ హీరో నిజంగానే పిచ్చి కొట్టుడు కొట్టాడు.. ఆ దెబ్బలకు నాకు జ్వరం వచ్చింది
Prabhas Sreenu
Rajeev Rayala
|

Updated on: Aug 25, 2026 | 12:39 PM

Share

తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు ప్రభాస్ శ్రీను. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా సినిమాలు చేసి ఆతర్వాత కమెడియన్ గా, కామెడీ విలన్ గా పాత్రలు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు ప్రభాస్ శ్రీను. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్ శ్రీను. కాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన హీరో రవితేజ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ వ్యక్తిత్వం, నటన సామర్థ్యంపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రవితేజ గారితో తనకు ఉన్న అనుబంధం, ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను శ్రీను పంచుకున్నారు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

ప్రభాస్ శ్రీను రవితేజను మన అద్దం అని పోల్చారు, అంటే ఆయన మనసులో ఏదీ దాచుకోరని, బోళా మనిషి అని అన్నారు. రవితేజ చాలా ప్రాక్టికల్‌గా ఉంటారని, అనవసరమైన పొగడ్తలను లేదా ఆర్భాటాలను ఇష్టపడరని శ్రీను అన్నారు. “నచ్చిందా, నచ్చినట్టు కూర్చో.. లేదంటే వెళ్ళిపో, డోంట్ వేస్ట్ టైమ్” అనేలా ఆయన ఉంటారని, సమయానికి ఎంతో విలువ ఇస్తారని అన్నారు. నటుడిగా రవితేజ గారికి ఒక ప్రత్యేకమైన శైలి ఉందని, ఏ పాత్రలో అయినా తనదైన “టింజ్” ను జోడించి ఆ క్యారెక్టర్‌ను అద్భుతంగా మెస్మరైజ్ చేయగలరని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. తెరపై ఆయన ఎలా ఉంటారో, తెర వెనుక కూడా అదే నిజాయితీ, ఉత్సాహంతో ఉంటారని అన్నారు. ఒక నటుడికి ఇది చాలా కష్టమైన విషయం అయినప్పటికీ, రవితేజ దీనిని ఎంతో సులువుగా సాధిస్తారని అన్నారు ప్రభాస్ శ్రీను.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

విక్రమార్కుడు సినిమాలోని ఒక ఫైట్ సీన్ గురించి చెబుతూ, రవితేజ గారు నిజంగానే కొట్టారని ప్రభాస్ శ్రీను గుర్తుచేసుకున్నారు. “శ్రీను మరి దెబ్బలు తగులుతాయ్, సారీ నేను ఏం చేయలేను” అని రవితేజ అన్నారని, రియల్‌గా కొట్టేవారని ఆయన అన్నారు. ప్యాడ్స్ పెట్టినా, కెమెరా యాంగిల్స్ వల్ల అవి పక్కకు జరిగేవని, దాంతో నిజంగానే దెబ్బలు తగిలేవని.. ఆ దెబ్బలకు జ్వరం వచ్చేదని, చివరికి బర్నాల్ రాసుకోవాల్సి వచ్చిందని సరదాగా పంచుకున్నారు. రైటర్ కన్నం కూడా ఈ దెబ్బలకు నాలుగు రోజులు జ్వరంతో బాధపడ్డారని చెప్పారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రాజమౌళి గారు మానిటర్ దగ్గర నవ్వుతుంటే, “నాకు దెబ్బలు తగులుతుంటే మీరు నవ్వుతారా” అని అడిగినట్లు శ్రీను గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

Raviteja

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us