Conman Sukesh - Jacqueline Fernandez: అప్పుడు ప్రేమతో.! ఇప్పుడు కోపంతో.! కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్‌.

Conman Sukesh – Jacqueline Fernandez: అప్పుడు ప్రేమతో.! ఇప్పుడు కోపంతో.! కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్‌.

Anil kumar poka

|

Updated on: Dec 24, 2023 | 10:21 AM

మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఢిల్లీ జైలులో ఉన్న కేటుగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను బెదిరించడం సంచలనం రేపుతోంది. తనపై కోర్టులో కేసులు వేస్తే జాక్వెలిన్‌ గుట్టురట్టు చేస్తానని హెచ్చరించాడు సుఖేశ్‌. జాక్వెలిన్‌ తనను మోసం చేసిందని , ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. జాక్వెలిన్ తనను దెయ్యంలా చూస్తోందని, దెయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించాడు. తన మౌనాన్ని బలహీనతగా చూస్తోందన్నాడు.

మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఢిల్లీ జైలులో ఉన్న కేటుగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను బెదిరించడం సంచలనం రేపుతోంది. తనపై కోర్టులో కేసులు వేస్తే జాక్వెలిన్‌ గుట్టురట్టు చేస్తానని హెచ్చరించాడు సుఖేశ్‌. జాక్వెలిన్‌ తనను మోసం చేసిందని , ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. జాక్వెలిన్ తనను దెయ్యంలా చూస్తోందని, దెయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించాడు. తన మౌనాన్ని బలహీనతగా చూస్తోందన్నాడు. జాక్వెలిన్‌కు తనతో ఉన్న సంబంధాలపై ఆధారాలను కోర్టుకు , దర్యాప్తు సంస్థలకు ఇస్తానని తెలిపాడు. జాక్వెలిన్‌తో చాట్స్‌ , స్క్రీన్‌షాట్స్‌ , రికార్డింగ్స్‌ , విదేశీ ఆర్ధిక లావాదేవీలు , పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు ఇస్తానని సుఖేశ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించాడు. ‘ నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. నాపై కేసులు పెడితే ఆధారాలు బయటపెడతా’ అంటూ లెటర్లతో సుఖేశ్‌ తనను వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయించింది జాక్వెలిన్‌. మరోవైపు జాక్వెలిన్‌ తనను మోసం చేసిందని సుఖేష్‌ ఆరోపిస్తున్నాడు.

ఇక 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జైలులో ఉన్నాడు సుఖేశ్‌. ఈ కేసులో జాక్వెలిన్‌ను ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారించింది. సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి తాను విలువైన బహుమతులు అందుకున్న విషయం వాస్తవమేనని జాక్వెలిన్‌ ఒప్పుకుంది. అయితే అతడి అక్రమ సంపాదన గురించి తెలియదని స్పష్టం చేసింది. అయితే స్వీట్‌హార్ట్‌ , బుట్టబొమ్మ అంటూ లెటర్లు రాస్తూ తనను సుఖేశ్‌ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టును ఆశ్రయించాడు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. గ్యాంగ్‌స్టర్‌ సుకేశ్‌ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరు సైతం ఉంది. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పలుసార్లు జాక్వెలిన్‌ను విచారించింది. ఇందులో ప్రధాన నిందితుడు సుకేశ్‌, జాక్వెలిన్‌ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.