Andhra Pradesh: ఇదో అద్భుతం.. పెన్సిల్‌పై నిలిచిన ఆంజనేయుడు..! మైక్రో ఆర్టిస్ట్ రామభక్తితో అయోధ్యకు..!!

రెండు సెంటీమీటర్ల ఎత్తు, 1.2 సెంటీ మీటర్ల వెడల్పుతో మైక్రో ఆర్ట్ చేశాడు వెంకటేష్. ఐదు గంటల పాటు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించాడు. ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలను పెన్సిల్ మనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్.. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రాంగణంలో తన కళను

Andhra Pradesh: ఇదో అద్భుతం.. పెన్సిల్‌పై నిలిచిన ఆంజనేయుడు..!  మైక్రో ఆర్టిస్ట్ రామభక్తితో అయోధ్యకు..!!
Hanuman Idol On Pencil
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 19, 2024 | 12:41 PM

విశాఖపట్నం, జనవరి19; అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో.. జగమంతా రామమయంగా మారింది. ఈ శుభ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కోలా రాముడిపై ఉన్న అభిమానాన్ని, భక్తిని చాటుకుంటున్నారు. అయితే.. ఓ సూక్ష్మ కళాకారుడు తమదైన శైలిలో రామ భక్తి ప్రదర్శించాడు. పెన్సిల్ మొన పై అతి సూక్ష్మ హనుమంతుడి కళా రూపం చెక్కి ఔరా అనిపించాడు. అంతేకాదు.. అయోధ్య రామాలయ ఫోటో గ్యాలరీలో సూక్ష్మ కళాఖండాన్ని పెట్టేందుకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు సెంటీమీటర్ల ఎత్తు..

– రెండు సెంటీమీటర్ల ఎత్తు, 1.2 సెంటీ మీటర్ల వెడల్పుతో మైక్రో ఆర్ట్ చేశాడు వెంకటేష్. ఐదు గంటల పాటు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించాడు. ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలను పెన్సిల్ మనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్.. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రాంగణంలో తన కళను భాగం పంచుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అప్పటికే చెక్కిన కొన్ని కళారూపాల ఫోటోలతో అయోధ్య నిర్వహకులకు లేఖ రాశాడు. అతడి భక్తితో పాటు సూక్ష్మ కళ ను అభినందించి హనుమంతుని కళారూపం పంపాలని అయోధ్య నుంచి కబురు అందినట్టు చెబుతున్నాడు వెంకటేష్. దింతో అయోధ్య రామ మందిర ఆలయ ఫోటో గ్యాలరీ కోసం పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు టీవీ9 తో చెప్పాడు . సూక్ష్మ కళాఖండం అయోధ్యలో భాగం పంచుకుంటుండడం కంటే ఇంకా ఆనందం ఏముంటుందని అంటున్నాడు ఈ మైక్రో ఆర్టిస్ట్.

ఇవి కూడా చదవండి

న్యూ జెర్సీ ప్రభుత్వం నుంచి ఆర్టిస్ట్ సర్టిఫికేషన్..

– గట్టెం వెంకటేష్ స్వస్థలం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లు గ్రామం. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తిచేసిన వెంకటేష్.. 400కిపైగా సూక్ష్మ కళాకృతులను రూపొందించారు. వందకు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్న సూక్ష్మ కళాకారుడు… 19 ఏళ్లకే వెంకటేష్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. తాజాగా యూఎస్ఏ‌లోని న్యూజెర్సీ ప్రభుత్వం నుంచి ఆర్టిస్ట్ సర్టిఫికేషన్ అందుకున్నరు వెంకటేష్. ఈ మైక్రో ఆర్టిస్ట్ ప్రతిభను అందరూ అభినందిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..