AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం.. మృతుల్లో మహిళలు సహా..

నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా మూడో అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు. పొగలకు తోడు అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారని, వారు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. మూడు ఫ్లోర్లను దట్టమైన పొగలు కమ్ముకున్నాయని చెప్పారు. పరిస్థితి అస్పష్టంగా మారింది.

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం.. మృతుల్లో మహిళలు సహా..
Delhi Fire Accident
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2024 | 10:28 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పితంపుర జెడ్పీ బ్లాక్‌లోని నాలుగు అంతస్తుల ఇంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరురుగు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఏడుగురిని రక్షించి సమీప ఆస్పత్రికి తరలించారు. భవనం నుండి ప్రజలను ఖాళీ చేయించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చాలా మంది అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిసింది.

గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా మూడో అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు. పొగలకు తోడు అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారని, వారు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. మూడు ఫ్లోర్లను దట్టమైన పొగలు కమ్ముకున్నాయని చెప్పారు. పరిస్థితి అస్పష్టంగా మారింది. మొదటి అంతస్తులో ఉంటున్న ఉక్కు వ్యాపారి సుభాష్ జైన్ ఇంట్లో మంటలు చెలరేగినట్టుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

పితాంపురలోని జెడ్‌పి బ్లాక్‌లో అగ్నిప్రమాదం గురించి రాత్రి 8 గంటలకు కాల్ రావడంతో ఎనిమిది ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి పిలిపించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!