Mahashivratri 2024: హరహర మహాదేవ.. మార్చి ఒకటో తేదీ నుంచి 11 రోజులు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Srisailam: అధికారులందరూ పరస్పర సమన్వయంతో ఉత్సవాలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలు, అధికారులకు సూచించారు. దేవస్థానం ఉద్యోగులంతా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పారు. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలని చెప్పారు. దేవస్థానం పరిధిలోని విభాగాల వారీగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కూలంకుషంగా చర్చించారు. 

Mahashivratri 2024: హరహర మహాదేవ.. మార్చి ఒకటో తేదీ నుంచి 11 రోజులు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
Srisailam
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 19, 2024 | 8:48 AM

కర్నూలు, జనవరి19; నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు 11 రోజులపాటు మహశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు దేవస్థానం పరిపాలన భవనంలో ప్రాధమిక సమావేశాన్ని నిర్వహించారు, ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్, వైద్య,పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్,ఈవో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది అంతా కృషిచేయాలని సూచించారు.  బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబందించిన అంశాలను కూలంకుషంగా చర్చించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు.

అధికారులందరూ పరస్పర సమన్వయంతో ఉత్సవాలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలు, అధికారులకు సూచించారు. దేవస్థానం ఉద్యోగులంతా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పారు. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలని చెప్పారు. దేవస్థానం పరిధిలోని విభాగాల వారీగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కూలంకుషంగా చర్చించారు.  అదేవిధంగా క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు విచేస్తారని, పాదయాత్ర మార్గంలోని భీమునికొలను, కైలాసద్వారం మార్గంలో విచ్చేసే భక్తులకు ఎంటుంటి అసౌకర్యం కలగకుండా అటవీశాఖ అధికారులతో కలసి ఎర్పాట్లను చేయాలని ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే ప్రతి విభాగం యాక్షన్ ప్లాన్ రూపొందించి కార్యాలయానికి అందించాలని, ఆక్షన్ ప్లాన్ అనుగుణంగా ఏర్పాట్లను వెంటనే చేపట్టాలన్నారు. అలాగే ఉత్సవాలలో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు, శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు మొదలైన వాటిని చర్చించారు.

బ్రహ్మోత్సవాలలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఉత్సవాలలో పండుగ వాతావరణం ఉండేవిధంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని పాతాళగంగలో అవసరమైన ఏర్పాట్లను ముఖ్యంగా రక్షణ కంచే ఏర్పాటు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన షెడ్ల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆలయ చైర్మన్,ఈవో పెద్దిరాజు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ..
ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ..
నిద్ర లేమి సమస్యకు బెస్ట్ మెడిసిన్ ఈ పానీయాలు.. ట్రై చేసి చూడండి
నిద్ర లేమి సమస్యకు బెస్ట్ మెడిసిన్ ఈ పానీయాలు.. ట్రై చేసి చూడండి
Video: విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన అభిమానులు
Video: విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన అభిమానులు
హోండా కార్లపై తగ్గింపుల జాతర.. ఆ మోడల్స్‌పై నమ్మలేని ఆఫర్స్
హోండా కార్లపై తగ్గింపుల జాతర.. ఆ మోడల్స్‌పై నమ్మలేని ఆఫర్స్
ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను..
ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను..
ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ వెల్లడి
ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ వెల్లడి
హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ 4 పదార్థాలను అస్సలు తినకండి
హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ 4 పదార్థాలను అస్సలు తినకండి
కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.