YSRCP: వైసీపీ ఇప్పటివరకు మార్చిన ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు ఇవే.. త్వరలోనే 5వ జాబితా విడుదల..

వైసీపీ అధిష్ఠానం నాలుగో జాబితా విడుదల చేసింది. ఈసారి 9 మందితో లిస్ట్‌ ప్రకటించిన వైసీపీ.. ఐదుగురు సిట్టింగ్‌లకు షాకిచ్చింది. మొత్తంగా ఇప్పటివరకు 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ఖరారు చేసింది. ఐదో జాబితా త్వరలోనే విడుదల కానుంది. ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు కొనసాగుతున్నాయి. లేటెస్ట్‌గా 9మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది పార్టీ నాయకత్వం.

YSRCP: వైసీపీ ఇప్పటివరకు మార్చిన ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు ఇవే.. త్వరలోనే 5వ జాబితా విడుదల..
Cm Jagan
Follow us
Srikar T

|

Updated on: Jan 19, 2024 | 9:41 AM

విజయవాడ, జనవరి 19: వైసీపీ అధిష్ఠానం నాలుగో జాబితా విడుదల చేసింది. ఈసారి 9 మందితో లిస్ట్‌ ప్రకటించిన వైసీపీ.. ఐదుగురు సిట్టింగ్‌లకు షాకిచ్చింది. మొత్తంగా ఇప్పటివరకు 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ఖరారు చేసింది. ఐదో జాబితా త్వరలోనే విడుదల కానుంది. ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు కొనసాగుతున్నాయి. లేటెస్ట్‌గా 9మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది పార్టీ నాయకత్వం. ఎస్సీ నియోజకవర్గాలైన సింగనమల, నందికొట్కూరు, మడకశిర, తిరువూరుతోపాటు కనిగిరిలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇక కొవ్వూరు, గోపాలపురం సిట్టింగ్‌ నియోజకవర్గాలు మార్పులు చేయగా.. చిత్తూరు ఎంపీ రెడ్డప్పను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గానూ, ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌ గానూ మార్చారు. నాలుగో జాబితాలో ఒక్క కనిగిరి మినహా మిగిలిన అన్నీ ఎస్సీ రిజర్వుడు స్థానాలే.

శింగనమలలో జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులు, కనిగిరి- మధుసూదన్‌ యాదవ్‌ స్థానంలో దద్దాల నారాయణ యాదవ్‌, తిరువూరులో కె.రక్షణ నిధి స్థానంలో స్వామిదాస్‌ను నియమించారు. ఇక గోపాలపురం, కొవ్వూరులో ఉన్న ఎమ్మెల్యేలను అటూ ఇటూ మార్చారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్లేస్‌లో తానేటి వనితను ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. తానేటి వనిత ఎమ్మెల్యేగా ఉన్న కొవ్వూరుకు ఇన్‌ఛార్జ్‌గా తలారి వెంకట్రావును నియమించారు. మడకశిరలో ఎం.తిప్పేస్వామి స్థానంలో ఈర లక్కప్ప, నందికొట్కూరుకు ఆర్థర్‌కు బదులుగా డా.సుధీర్‌ దారాను ఇన్‌ఛార్జ్‌గా అవకాశం ఇచ్చారు. తొలి జాబితాలో 11 ఎమ్మెల్యే స్థానాలు, రెండో జాబితాలో 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 ఎమ్మెల్యే, నాలుగో జాబితాలో 1 ఎంపీ, 8 ఎమ్మెల్యేలతో కలిపి ఇప్పటి వరకూ మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చింది వైసీపీ అధిష్టానం. త్వరలోనే మరో 12 ఎంపీ అభ్యర్థులు, 5 నుంచి 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మార్పులపై నేతల నుంచి ఎలాంటి రియాక్షన్స్‌ వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..