AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఏపీలో ఎన్నికల ప్రచారానికి సిద్దమైన వైసీపీ.. తొలి బహిరంగ సభ అక్కడి నుంచే..

అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్‌ రెడీ అయింది. 175కి 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్‌.. భీమిలి నుంచి ఈ నెల 25న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. రాష్ట్రాన్ని ఐదు జోన్‌లుగా విభజించి ప్రతీ జోన్‌లో కార్యకర్తలతో ముఖాముఖి, ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధిష్ఠానం ప్రచారంపై ఫోకస్ పెట్టింది.

CM Jagan: ఏపీలో ఎన్నికల ప్రచారానికి సిద్దమైన వైసీపీ.. తొలి బహిరంగ సభ అక్కడి నుంచే..
CM Jagan
Srikar T
|

Updated on: Jan 19, 2024 | 6:34 AM

Share

విశాఖపట్నం, జనవరి 19: అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్‌ రెడీ అయింది. 175కి 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్‌.. భీమిలి నుంచి ఈ నెల 25న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. రాష్ట్రాన్ని ఐదు జోన్‌లుగా విభజించి ప్రతీ జోన్‌లో కార్యకర్తలతో ముఖాముఖి, ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధిష్ఠానం ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించింది. ఈ నెల 25న సీఎం జగన్‌ అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతి నియోజవర్గం ఐదు నుంచి ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందని.. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారన్నారు.

సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి కేడర్ సమావేశాలకు ప్లాన్ చేశారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారని.. రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతాయన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తారన్నారు. పార్టీలో అసంతృప్తులు తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వివరించి చెబుతున్నారన్నారు వైవీ. మొత్తానికి అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసుకుని ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతోంటే.. ప్రతిపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నాయన్న చర్చ జోరుగా నడుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..