West Godavari: ప్రాణం కాపాడిన బాంబే బ్లెడ్ గ్రూపు రక్తదాత.. బ్లెడ్ డోనర్‌కు అంతా సలాం

ఓ గర్భిణీకి అత్యవసర పరిస్థితుల్లో బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమైంది. స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఓ దాత ముందుకొచ్చి అత్యంత అరుదైన రక్తాన్ని ఆ గర్భిణీకి ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నాడు. అటువంటి అరుదైన బ్లడ్ గ్రూప్ రక్తం దొరకడానికి చొరవ చూపిన ఎమ్మెల్యే తో పాటు, రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన తాతను సైతం పలువురు ప్రశంశలతో ముంచేత్తుతున్నారు.

West Godavari: ప్రాణం కాపాడిన బాంబే బ్లెడ్ గ్రూపు రక్తదాత.. బ్లెడ్ డోనర్‌కు అంతా సలాం
West Godavari
Follow us
B Ravi Kumar

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 18, 2024 | 7:46 PM

అది ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా త‌క్కువ మందికే తెలిసిన బ్ల‌డ్ గ్రూప్ మాత్ర‌మే కాదు, చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఉండే బ్ల‌డ్ గ్రూప్ కూడా అదే.. ఇప్పుడెందుకు మనం ఆ బ్లడ్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా.. ఓ గర్భిణీకి అత్యవసర పరిస్థితుల్లో బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమైంది. స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఓ దాత ముందుకొచ్చి అత్యంత అరుదైన రక్తాన్ని ఆ గర్భిణీకి ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నాడు. అటువంటి అరుదైన బ్లడ్ గ్రూప్ రక్తం దొరకడానికి చొరవ చూపిన ఎమ్మెల్యే తో పాటు, రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన తాతను సైతం పలువురు ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన సుమకు నెలలు నిండడంతో డెలివరీకి సిద్ధమయింది. ఆమెను బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేయించారు. అయితే సుమకు డెలివరీ కోసం అత్యవసరంగా బ్లడ్ అవసరమని డాక్టర్లు బంధువులకు తెలిపారు.

అయితే సుమది భారతదేశంలో అత్యంత అరుదైన బొంబే బ్లడ్ గ్రూప్ O కావడంతో బాంబే బ్లడ్ గ్రూప్ అన్నీ బ్లడ్ బ్యాంక్ లలో రక్తం కోసం సంప్రదించారు. కానీ ఎక్కడ బాంబే బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ రక్తం వారికి దొరకలేదు. సుమ సమాచారాన్ని తెలుసుకున్న నర్సాపురం ఏం.ఎల్.ఏ ముదునూరి ప్రసాద్ రాజు ఆమె బందువులు సంప్రదించి నర్సాపురం గవర్నమెంట్ ఆసుపత్రిలో పని చేయుచున్న సూపరింటెండెంట్ డా.ఆర్.సుప్రియా మరియు ఇంచార్జ్ సూపరింటెండెంట్ డా. కె.జాన్ హరిసన్ సలహా మేరకు ఇండియాలో ఎక్కడైన బాంబే బ్లడ్ గ్రూప్ దొరుకుతుందో అని ఎంక్వైరీ చేయించారు. అయితే వారి ఎంక్వయిరీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి బాంబే బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ రక్తాన్ని ఇవ్వడానికి అంగీకరించి నర్సాపురం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కి వచ్చి రక్తదానం చేశారు. దీంతో సుమ డెలివరీ సాఫీగా జరిగి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా వున్నారు. అయితే అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ రక్తం దొరకడానికి సహకరించిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తోపాటు, తాతను సుమ తరపు బంధువులు అభినందించారు.. అసలు బాంబే బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి… ఎక్కడ పుట్టింది దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. బాంబే బ్లడ్ గ్రూప్ డాక్టర్లు చెప్పిన ప్రకారం మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాల్లో కొన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎవరి బ్లడ్ గ్రూప్ ఏదో అవే నిర్ధారిస్తాయి. ఈ మాలిక్యూల్స్ నుంచి కేపిటల్ హెచ్ ఎంటిజన్ తయారవుతుంది. దానివల్ల మిగతా ఎంటిజెన్ ఎ, బి తయారవుతాయి.బ్లడ్ గ్రూప్ ఏర్పడుతుంది.

బాంబే బ్లడ్ గ్రూప్ వారిలో షుగర్ మాలిక్యూల్స్ తయారు కాలేవు. అందుకే అందులో కేపిటల్ హెచ్ ఎంటిజెన్ ఉండదు. అవి ఎలాంటి బ్లడ్ గ్రూపులోకి రాదు. కానీ, ఆ రక్తం ఉన్న వారి ప్లాజ్మాలో యాంటీబాడీ ఎ, బి, మరియు హెచ్ ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వారి జీవితం పూర్తిగా మామూలుగా ఉంటుంది. వారికి శారీరకంగా ఎలాంటి సమస్యలూ ఉండవు. సాధారణంగా అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక నగరం పేరుతో ఉంది. దానికి కారణం మొట్టమొదట దీనిని మహారాష్ట్ర రాజధాని బాంబేలో గుర్తించారు. వైఎం భెండె 1952లో ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు. ఇప్పుడు కూడా ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ముంబైలోనే ఉండడం విశేషం. దానికి ఇది వంశపారంపర్యంగా రావడమే కారణం. ఈ రక్తం ఒక తరం నుంచి మరో తరానికి ఈ బ్లడ్ గ్రూప్ వస్తోంది. అయితే కొందరు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో, ప్రస్తుతం బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే