Tirumala Laddu: అయోధ్య‌ రామయ్యకు శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం.. భక్తుల వితరణకు రేపు విమానంలో తరలింపు

తిరుమల వెంకన్న భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదం అయోధ్యలోని రామ భక్తులకు అందజేయనున్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామ‌చంద్రుల‌ వారి విగ్ర‌హప్ర‌తిష్ట‌, శ్రీ‌రామ మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఒక లక్ష చిన్న లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

Tirumala Laddu: అయోధ్య‌ రామయ్యకు శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం.. భక్తుల వితరణకు రేపు విమానంలో తరలింపు
Tirupati Laddu For Ramayya
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Jan 18, 2024 | 7:25 PM

అంతా రామమయం.. జగమంతా రామమయం అనిపించేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమ క్రతువు జరుగుతోంది. దాదాపు 500ఏళ్ల కల నెరవేరే సమయం ఆసన్నం అవుతోంది. రామభక్తులు వివిధ రకాలుగా తమ రామ భక్తిని వెల్లడిస్తున్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు తన జన్మ భూమిలో కొలువు దీరే అమృత ఘడియలకు ఇంకా మూడు రోజులు మాత్రమే. ఈ నెల 22వ తేదీన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దేశ విదేశాల్లో రామ నామ స్మరణతో మారు మ్రోగిపోతోంది. రామయ్య కోసం తిరుమల శ్రీవారి కూడా తన ప్రసాదాన్ని పంపిస్తున్నారు.

తిరుమల వెంకన్న భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదం అయోధ్యలోని రామ భక్తులకు అందజేయనున్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామ‌చంద్రుల‌ వారి విగ్ర‌హప్ర‌తిష్ట‌, శ్రీ‌రామ మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఒక లక్ష చిన్న లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న‌ ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొనగా శ్రీవారి ల‌డ్డూల‌ను అయోధ్య‌కు పంపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 3 వేల కేజీల బరువు ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రేపు విమానంలో అయోధ్యకు పంపేందుకు టీటీడీ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

ఇవి కూడా చదవండి

అయోధ్యలోని భక్తులకు ఉచితంగా  అందచేయనున్న లడ్డూలను టిటిడి అయోధ్యకు చేర్చే పనిలో నిమగ్నం అయ్యింది. లడ్డూ ప్రసాదాలను అక్కడ ఆలయ నిర్మాణ ట్రస్ట్ కు అందజేయనుండగా శ్రీవారి లడ్డూ ప్యాకింగ్ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్  శివ‌ప్ర‌సాద్‌ తోపాటు పోటు ఏఈవో శ్రీ‌నివాసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..