AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామయ్య కోసం అయోధ్యలో 2 ఎకరాలు కొని మరీ తులసి వనం పెంపకం ..గజ తులసి మాలను సిద్ధం చేస్తున్న భక్తుడు

శ్రీ రాముడు అత్తారిల్లు నుంచి భారీగా కానుకలను ఇప్పటికే అందుకున్నాడు రామ చంద్రుడు. అయితే అయ్యవారికి నగలు నాణేలు కంటే.. తులసి అత్యంత పీతిప్రాత్రం అన్న మాటను గుర్తుంచుకున్నట్లున్నాడు ఓ భక్తుడు.. రామయ్యను సేవించడానికి ఏకంగా తులసి వనాన్ని సృష్టించాడు. బెంగుళూరు నగరానికి చెందిన ఒక భక్తుడు శ్రీరాముడిని తులసితో పూజించడానికి ఏకంగా తులసి వనాన్ని రెడీ చేశాడు.

Ayodhya: రామయ్య కోసం అయోధ్యలో 2 ఎకరాలు కొని మరీ తులసి వనం పెంపకం ..గజ తులసి మాలను సిద్ధం చేస్తున్న భక్తుడు
Tulasi Mala For Lord Sri Ra
Surya Kala
|

Updated on: Jan 18, 2024 | 6:15 PM

Share

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుక రోజుల్లోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రాణ ప్రతిష్ట కోసం నిర్వహించాల్సిన కతృవు,  పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఐదు శతాబ్దాల కల సాకారం కానుండడంతో రామభక్తులు పలు రకాలుగా  రామయ్య మీద తమ భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తున్నారు. కొందరు వజ్రాల నగలు సమర్పిస్తే.. మరికొందరు భారీగా ప్రసాదాలను సమర్పిస్తున్నారు.. శ్రీ రాముడు అత్తారిల్లు నుంచి భారీగా కానుకలను ఇప్పటికే అందుకున్నాడు రామ చంద్రుడు. అయితే అయ్యవారికి నగలు నాణేలు కంటే.. తులసి అత్యంత పీతిప్రాత్రం అన్న మాటను గుర్తుంచుకున్నట్లున్నాడు ఓ భక్తుడు.. రామయ్యను సేవించడానికి ఏకంగా తులసి వనాన్ని సృష్టించాడు. బెంగుళూరు నగరానికి చెందిన ఒక భక్తుడు శ్రీరాముడిని తులసితో పూజించడానికి ఏకంగా తులసి వనాన్ని రెడీ చేశాడు. అయోధ్య సమీపంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి తులసి మొక్కలను పెంచుతున్నాడు.

బెంగళూరు నగరంలోని జయనగర్ నివాసి అయిన రామ భక్తుడు శ్రీరాముడిని పూజించడానికి తులసి ప్రధానం అని భావించాడు. దీంతో అయోధ్య నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలో గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని తులసి అడవుల నుంచి కృష్ణ తులసి విత్తనాలను తీసుకొచ్చి నాటారు.

ఈ తులసి మొక్కలను అత్యంత శ్రద్ధతో పెంచారు. ప్రస్తుతం తులసి మొక్కలు పెరగడంతో బాల రామయ్య ప్రతిష్టాపన సమయంలో తులసి మాలను సమర్పించాలని భావించిన భక్తుడు.. బెంగుళూరుకు చెందిన ముగ్గురు యువకులను అయోధ్యకు పంపించాడు. బెంగళూరు నుంచి విమానంలో అయోధ్యకు చేరుకున్న ఈ ముగ్గురు యువకులు అయోధ్యకు చేరుకుని పూలమాలలు కట్టే పని ప్రారంభించారు. జనవరి 17వ తేదీ నుంచి నిరంతరాయంగా తులసి సేవ చేస్తూనే జనవరి 22న రామ్ లల్లాకు ప్రత్యేక తులసి మాలను సమర్పించడానికి సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..