- Telugu News Photo Gallery Spiritual photos Lord Ram: A Bakery Shop Owner Has Made Ayodhya Sri Ram Mandir In A Cake In Gadag karnataka
Ayodhya: బేకరీ షాప్‌లో అయోధ్య రామ మందిర తరహా కేక్.. సెల్ఫీలు దిగుతూ భక్తుల సందడి..
కొన్ని వందల ఏళ్ల కల నెరవేరే సమయం ఆసన్నం అవుతోంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు తన జన్మ భూమి అయోధ్యలో కొలువు దీరే శుభ తరుణం రానే వచ్చేసింది. రామ మందిరంలోని గర్భ గుడిలో ఈ నెల 22వ తేదీన బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశ విదేశాల్లో రామ నామ స్మరణతో మారు మ్రోగిపోతోంది. భారీ సంఖ్యలో అయోధ్యకు పయనం అవుతుంటే.. మరికొందరు రామయ్యపై తమ భక్తిని వివిధ రకాలుగా వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ బేకరీ షాప్ యజమాని రామ మందిరం తరహాలో కేక్ ని తయారు చేశాడు.
Updated on: Jan 18, 2024 | 5:54 PM

అంతా రామమయం.. జగమంతా రామమయం అనిపించేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. రామభక్తులు రాములోరికి కానుకలను అందిస్తున్నారు. అదే సమయంలో కొందరు వివిధ రకాలుగా తమ భక్తిని ప్రకటిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని గడగ్‌లోని ఓ బేకరీ షాపులో అయోధ్య శ్రీరామ మందిరం తరహాలో ఓ కేకుని తయారు చేశారు. ఈ కేకు కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

నాలుగు రోజుల్లో (ఈనెల 22న) అయోధ్య శ్రీరామ మందిరంలోని గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠపన కార్యక్రమం జరగనుంది.

రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలో సందడి నెలకొంది. ఓ వైపు రామయ్య అక్షతలను గడపగడపకు వితరణ చేస్తున్నారు. మరోవైపు కళాకారులు వివిధ రకాల కళాఖండాలను సృష్టిస్తున్నారు. రామభక్తులు మట్టితో రాముని విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఆలయాకృతిలో రకరకాల కళాకృతులను తయారు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గడగ్ నగరంలో కూడా శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ససనురా బేకరీ షాపులో శ్రీరామ మందిరం నిర్మాణానికి ప్రతిరూప్యాన్ని కేక్ తో సృష్టించారు.

కేక్‌తో చేసిన ఈ అందమైన అయోధ్య దేవాలయం లైట్లతో మెరిసిపోతోంది. వినియోగదారులను ఆకర్షిస్తోంది.

శ్రీరామ మందిరం కేక్ ను చూసేందుకు ప్రజలు దుకాణానికి తరలివస్తున్నారు. కేక్ రామమందిరంతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

అయోధ్య రామమందిరానికి సంబంధించిన 20-25 కిలోల బరువైన కేక్ నమూనాను తయారు చేశారు బేకరీ సిబ్బంది. ఈ కేక్ తయారీలో సుమారు 10 మంది కార్మికుల పని చేశారు. తమ నైపుణ్యంతో రామమందిరాన్ని నిర్మించారు.

కేక్‌గా తయారు చేసిన రామమందిర నమూనా జనవరి 22 వరకు ప్రదర్శించబడుతుందని బేకరీ షాప్ యాజమాన్యం వెల్లడించింది.




