AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggery Tea: చలికాలంలో చక్కెరకు బదులు బెల్లం టీ తాగండి.. అమేజింగ్ బెనిఫిట్స్ .. వెయిట్ లాస్ కూడా!

బెల్లంలో క్యాలరీలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. బెల్లం టీ గర్భధారణ సమయంలో బలహీనతను తగ్గిస్తుంది. తల్లి, బిడ్డ ఇద్దరికీ మంచి శక్తిని అందిస్తుంది. కాబట్టి గర్భిణులు రోజూ బెల్లం టీ తాగాలి. చలికాలంలో బెల్లం టీని ఎక్కువగా తాగడం వల్ల జలుబు, జ్వరం వంటి వ్యాధులు దరిచేరవు . కాబట్టి చలికాలంలో నిరంతరం బెల్లం టీ తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

Jaggery Tea: చలికాలంలో చక్కెరకు బదులు బెల్లం టీ తాగండి.. అమేజింగ్ బెనిఫిట్స్ .. వెయిట్ లాస్ కూడా!
Jaggery Tea
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2024 | 7:08 AM

Share

భారతదేశంలోని దాదాపు ప్రతి ఇల్లు ఉదయం ఒక కప్పు వేడి టీతో ప్రారంభమవుతుంది. అటువంటప్పుడు పంచదార టీకి బదులుగా బెల్లం టీ తాగడం వల్ల మీకు వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా మీకు తాజాదనాన్ని, శక్తిని ఇస్తుంది. పోషకాలు పుష్కలంగా ఉన్న బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శీతాకాలపు సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడుతుంది. బహిష్టు సమయంలో కడుపు నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనానికి బెల్లం టీ దివ్యౌషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి శరీరానికి విశ్రాంతినిస్తాయి. బెల్లం టీ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం…

అనీమియా రిలీఫ్:

బెల్లం మంచి మొత్తంలో ఐరన్ కలిగి ఉన్న సహజమైన ఆహారం. రోజూ బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. తద్వారా రక్తహీనత నుండి ఉపశమనం లభిస్తుంది. బెల్లం టీ తాగడం వల్ల రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

బెల్లం మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. బెల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తికి కీలకం. రోగనిరోధక శక్తి శరీరం అంటువ్యాధులు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. పొటాషియం మెండుగా ఉండే బెల్లం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి పొటాషియం తోడ్పడుతుంది. అధిక బరువును ఇది కరిగిస్తుంది.

గర్భధారణ సమయంలో ప్రయోజనాలు:

గర్భధారణ సమయంలో బెల్లం టీ తాగడం వల్ల మహిళలు బలహీనంగా ఉండరు. బెల్లంలో క్యాలరీలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. బెల్లం టీ గర్భధారణ సమయంలో బలహీనతను తగ్గిస్తుంది. తల్లి, బిడ్డ ఇద్దరికీ మంచి శక్తిని అందిస్తుంది. కాబట్టి గర్భిణులు రోజూ బెల్లం టీ తాగాలి. చలికాలంలో బెల్లం టీని ఎక్కువగా తాగడం వల్ల జలుబు, జ్వరం వంటి వ్యాధులు దరిచేరవు . కాబట్టి చలికాలంలో నిరంతరం బెల్లం టీ తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

బెల్లం టీ ఎలా తయారు చేయాలి..

బెల్లం టీ చేస్తే పాలు విరిగిపోతున్నాయని చాలా మంది అంటారు. ఈ రోజు మనం టీని సరిగ్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం… ముందుగా ఒక్క గిన్నెలో టీకి కావాల్సిన నీరు, టీ ఆకులు, పాలు వేసుకుని బాగా మరిగించండి. 5-7 నిమిషాలు మరిగిన తర్వాత గ్యాస్‌ను ఆపివేసి, ఇప్పుడు అందులో కవాల్సినంత బెల్లం వేసుకోండి..టీలో వేడెక్కుతున్న కొద్దీ బెల్లం దానంతట అదే కరిగిపోతుంది. ఈ విధంగా టీ తయారు చేసుకుని తాగండి. ఇక బెల్లం టీ అంత త్వరగా చెడిపోదు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్