రూ.9వేలు పెట్టి 100 గ్రాముల ద్రాక్ష పండ్లను కొన్న కోటీశ్వరాలు.. కానీ, తినకుండా ఏం చేసిందో తెలిస్తే నోరెళ్ల బెడతారు..

సాధారణంగా ద్రాక్ష కిలో రూ.100 నుంచి 200 వరకు దొరుకుతుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష గురించి మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష జపాన్‌లో పండిస్తారు. దీనిని జపాన్‌లోని రూబీ రోమన్ ద్రాక్ష అని కూడా పిలుస్తారు. ఇదిలా ఉంటే దుబాయ్‌లో నివసిస్తున్న ఓ మహిళ ద్రాక్ష గుత్తిని 92 పౌండ్లు అంటే దాదాపు 9 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఆమె దాన్ని తినలేదు. దీని వెనుక ఆ మహిళ చెప్పిన కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

రూ.9వేలు పెట్టి 100 గ్రాముల ద్రాక్ష పండ్లను కొన్న కోటీశ్వరాలు.. కానీ, తినకుండా ఏం చేసిందో తెలిస్తే నోరెళ్ల బెడతారు..
Purchased Grams
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 18, 2024 | 12:54 PM

ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలు ఏదైనా చేస్తారు. వాడుకోవడానికి కూడా వీలులేని ఇలాంటి వాటిని కొనుగోలు చేసేందుకు కొందరు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాంటి పనిచేసిన ఒక మహిళ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ద్రాక్ష పండ్ల కోసం 9000 రూపాయలకు పైగా ఖర్చు చేసిన ఒక ధనిక మహిళ తనకు ఆ పండ్లను తినబుద్దేయటం లేదంటూ పేర్కొంది. దీని వెనుక ఆ మహిళ చెప్పిన కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

సాధారణంగా ద్రాక్ష కిలో రూ.100 నుంచి 200 వరకు దొరుకుతుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష గురించి మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష జపాన్‌లో పండిస్తారు. దీనిని జపాన్‌లోని రూబీ రోమన్ ద్రాక్ష అని కూడా పిలుస్తారు. ఇదిలా ఉంటే దుబాయ్‌లో నివసిస్తున్న ఓ మహిళ ద్రాక్ష గుత్తిని 92 పౌండ్లు అంటే దాదాపు 9 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఆమె దాన్ని తినలేదు. దీని వెనుక ఆ మహిళ చెప్పిన కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

దుబాయ్‌లో నివసిస్తున్న అత్యంత ధనవంతులైన మహిళను దలీలా లారిబీగా గుర్తించారు. దలీలా లారిబి అనే మహిళ తన టిక్‌టాక్ ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ద్రాక్ష గుత్తితో కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షను దుబాయ్‌లో కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ వీడియోలో మహిళ చెబుతోంది. అయితే, తాను కొనుగోలు చేసిన ద్రాక్షను తినేసి పోగొట్టుకోవటం లేదని చెప్పింది. అయితే, దాన్ని ఏం చేయాలో ఆమెకు తెలియటం లేదని చెప్పింది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ఆ పండ్లను తినాలని తనకు పెద్ద ఆసక్తి లేదట. కానీ, ఈ ద్రాక్ష పండ్ల గురించి ఎవరో చెబితే.. తాను టేస్ట్ చేయాలని అనుకుందట.. అందుకే 428 యూఏఈ దిర్హామ్‌లు చెల్లించి(రూ. 9,000) 100 గ్రాముల గ్రేప్స్ కొనుగోలు చేసింది. అంత స్పెషల్ ఏంటో? ఆ పండు టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుని.. తన మిత్రులకు తెలియజేసేందుకు ఆ ద్రాక్ష గుత్తిలోఒక్క పండు మాత్రం తింటున్నగా చెప్పింది..అయితే, ఆ పండు తినగానే.. అందులో తాను ఒక రకమైన సువాసనను గుర్తించినట్టుగా చెప్పింది. పండ్లను సగానికి కొరికి తిన్నాక.. చాలా రుచిగా అనిపించిందట. అంతేకాదు.. సగం తిన్న తర్వాత కూడా తినాల వద్దా అనే తర్జనా భర్జనలో పడిందట.. ఆ పండును పూర్తిగా తింటే అయిపోతుందని పక్కకు పెట్టేసిందట లారీబీ. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి