ఇక్కడ సంక్రాంతి వెరీ స్పెషల్.. కత్తి సాము.. ఆయుధ పూజలతో ఉత్సవాలు..
బారిజం ఉత్సవంలో కత్తి సాము ప్రత్యేక ఆకర్షణ. అన్నదమ్ములు, బావ బావమరుదులు, వరస అయ్యే వాళ్ళు కత్తులు తిప్పుతారు. సందడి చేస్తారు. గిరిజన యువత రకరకాల వేషధారణలతో ఆకట్టుకుంటారు. గిరి మహిళలు, యువత దింసా నృత్యం చేస్తారు. ఈ పండుగ పూట అంతా ఒక్కచోట చేరి ఆనందోత్సవాలతో గడుపుతామని అంటున్నారు ఇక్కడి స్థానికులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, జనవరి; భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. ప్రాంతాలకు తగ్గట్టు ఆచారాలు, సాంప్రదాయాలు.. ఒక్కో ప్రాంతంలో ఉత్సవాలు, పండుగలు ఒక్కోలా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంతా సందడిగా సాగితే.. ఏజెన్సీలో పండక్కి ఆయుధ పూజలు.. కత్తి సాము..! బారిజం ఉత్సవం అక్కడి ప్రత్యేకత. మామూలుగా ఉండదు మరి.
– ఏజెన్సీలో జరిగే పండుగలు ఉత్సవాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆసక్తిని రేపుతుంటాయి. ఏ ఉత్సవమైనా వారి సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అల్లూరి ఏజెన్సీలో సంక్రాంతి ని ఉత్సాహంగా జరుపుకున్న గిరిజనులు.. ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారిజం ఉత్సవంలో గిరిజనులు సందడి చేశారు. గ్రామ దేవతకు ఆయుధాలకు పూజలు చేశారు. డోకులూరు, లింగాపుట్టులో ఈ ఉత్సవం సందడిగా నిర్వహించారు.
ఆయుధ పూజ..
– సంక్రాంతి పండుగ అయిన తరువాత బారిజం ఉత్సవం నిర్వహించడం ఏజెన్సీలో ఆనవాయితీ. ఈ ఏడాది డోకులూరు, లింగాపుట్టు లో బారిజం నిర్వహించారు. గ్రామచావడిలో కొలువైన గంగమ్మ, సంకుదేవులకు పూజలు చేశారు గిరిజనులు. పురాతన ఆయుధాలు, పెద్దలకు పూజలు చేసి.. పాడి పంటలు బాగా పండి.. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటామని అంటున్నారు గ్రామ పెద్ద విశ్వేశ్వర నాయుడు.
అన్నదమ్ములు, బావ బావమరుదుల కత్తి సాము.. అక్కడ స్పెషల్..
– బారిజం ఉత్సవంలో కత్తి సాము ప్రత్యేక ఆకర్షణ. అన్నదమ్ములు, బావ బావమరుదులు, వరస అయ్యే వాళ్ళు కత్తులు తిప్పుతారు. సందడి చేస్తారు. గిరిజన యువత రకరకాల వేషధారణలతో ఆకట్టుకుంటారు. గిరి మహిళలు, యువత దింసా నృత్యం చేస్తారు. ఈ పండుగ పూట అంతా ఒక్కచోట చేరి ఆనందోత్సవాలతో గడుపుతామని అంటున్నారు ఇక్కడి స్థానికులు.
– బారిజం ఉత్సవం చూసేందుకు ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు. ఉత్సవం ముగిసాక మరుసటి రోజు అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..