Khammam: కోడి పందెంలో బుల్లెట్ గెలుచుకున్న పందెం రాయుడు..

నారాయణపురం గ్రామానికి చెందిన రాహుల్ రెడ్డి, కంద కృష్ణారెడ్డి కి చెందిన పందెంకోడి గెలుపొందింది. పందెంలో ఆరు లక్షల రూపాయల విలువై బుల్లెట్ బండిని బహుమతిగా ప్రకటించారు. పందెంలో గెలిచిన కోడి సుమారు 15 పందాల్లో బహుమతి గెలుచుకున్నదని రాహుల్ రెడ్డి, కంద కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సారి పందెంలో బుల్లెట్ బహుమతి గెలుచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

Khammam: కోడి పందెంలో బుల్లెట్ గెలుచుకున్న పందెం రాయుడు..
Won Royal Enfield Bullet
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 18, 2024 | 11:19 AM

ఖమ్మం జిల్లా, జనవరి18; సంక్రాంతి అంటే తెలుగు వారికి పెద్ద పండుగ..అయితే ఈ పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు..మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున జరుగుతాయి..తెలంగాణ లో వీటిపై అనుమతి లేదు ..కనుక ఆంధ్ర లో జరుగుతున్న కోడి పందాలకి సరిహద్దున ఉన్న ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు తరలి వెళ్ళారు..ఏపి లోని ఎన్టీఆర్ జిల్లా నెమలి కొణిజర్ల లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన కోడి పందెంలో బుల్లెట్ బహుమతి ప్రకటించారు.

మూడు రోజులపాటు జరిగిన ఈ కోడి పందాల సంబరాలను వేలాదిమంది ప్రజలు వీక్షించారు. పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు పాల్గొన్నారు..చివరి రోజు జరిగిన పందెంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రాహుల్ రెడ్డి, కంద కృష్ణారెడ్డి కి చెందిన పందెంకోడి గెలుపొందింది. పందెంలో ఆరు లక్షల రూపాయల విలువై బుల్లెట్ బండిని బహుమతిగా ప్రకటించారు. పందెంలో గెలిచిన కోడి సుమారు 15 పందాల్లో బహుమతి గెలుచుకున్నదని రాహుల్ రెడ్డి, కంద కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సారి పందెంలో బుల్లెట్ బహుమతి గెలుచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

Kodi Pandalu

Kodi Pandalu

పందెంలో గెలుపొందిన బుల్లెట్ ను కమిటీ నిర్వాహకులు చుంచు రవిశంకర్ ప్రసాద్ కృష్ణారెడ్డికి అందజేశారు. రాహుల్ రెడ్డి, కృష్ణారెడ్డి బుల్లెట్ బహుమతి అందుకోవటం పట్ల అతని స్నేహితులు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..