పాత 2రూపాయల నాణెం ఇస్తే రూ.31 లక్షలు ఇస్తామంటూ వృద్ధుడికి పంగనామం.. లక్షలు పోగొట్టుకుని చివరకు..

బాధితుడు వద్ద ఉన్న కాయిన్స్ ను ఫోటో తీసి పంపాలని కోరారు. బాధితుడి వద్ద ఉన్న ఐదు రూ.2 రూపాయల కాయిన్స్ తో పాటు ఒక రూ.5 రూపాయల కాయిన్ ను ఫోటో తీసి పంపించాడు. ఈ పాత కాయిన్స్ 1980,1990 నాటి కాలంలో చలామణి అయినవి.. వీటిపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బొమ్మతో పాటు భారత మ్యాప్ సైతం ఈ పాత కాయిన్స్ మీద ఉంటుంది . బాధితుడి వద్ద ఉన్న పాత కాయిన్స్ కు అక్షరాల రూ.31 లక్షల రూపాయలు వస్తుందని నమ్మించారు.

పాత 2రూపాయల నాణెం ఇస్తే రూ.31 లక్షలు ఇస్తామంటూ వృద్ధుడికి పంగనామం.. లక్షలు పోగొట్టుకుని చివరకు..
Old Coins
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 18, 2024 | 11:49 AM

హైదరాబాద్, జనవరి18; తమ వద్ద పాత రూ.2 కాయిన్స్ లేదా రూ.5 కాయిన్స్ ఉంటే తమకు ఇవ్వాలని దానికి బదులుగా లక్షల రూపాయలు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రసారం చేశారు. వీడియో తిలకించిన ఒక వృద్ధుడు అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరికి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని పోలీసులను ఆశ్రయించాడు. బెంగళూరులోని ఉల్సూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో వీడియోను చూసిన వృద్ధుడు వీడియోలో కనిపించిన ఫోన్ నెంబర్ కు కాల్ చేశాడు. తన వద్ద ఎలాగో పాత 2. రూపాయలు, 5 . రూపాయల కాయిన్స్ ఉండటంతో వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్కు కాల్ చేశాడు. బాధితుడు నుండి కాల్ రాగానే నిజమైన డీల్ లాగా సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. వీడియో కాల్ చేసి కొంతమంది పాత కాయిన్స్ ను లెక్కపెడుతున్న దృశ్యాలను చూయించాడు. బాధితుడు వద్ద ఉన్న కాయిన్స్ ను ఫోటో తీసి పంపాలని కోరారు. బాధితుడి వద్ద ఉన్న ఐదు రూ.2 రూపాయల కాయిన్స్ తో పాటు ఒక రూ.5 రూపాయల కాయిన్ ను ఫోటో తీసి పంపించాడు. ఈ పాత కాయిన్స్ 1980,1990 నాటి కాలంలో చలామణి అయినవి.. వీటిపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బొమ్మతో పాటు భారత మ్యాప్ సైతం ఈ పాత కాయిన్స్ మీద ఉంటుంది . బాధితుడి వద్ద ఉన్న పాత కాయిన్స్ కు అక్షరాల రూ.31 లక్షల రూపాయలు వస్తుందని నమ్మించారు.

కొద్దిసేపటి తర్వాత రకరకాల పేర్లు, టాక్స్ ల నిబంధనలు చెప్పి బాధితుడు ఖాతా నుండి 2.3 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు లాగేశారు. అయితే మరికొంత డబ్బు పంపించాలని నేరగాళ్లు కోరడంతో బాధితుడికి అనుమానం కలిగింది. దీంతో బాధితుడు డబ్బు పంపడం ఆపేసాడు. బాధితుడు నుండి డబ్బు రాకపోవటంతో అలర్ట్ అయ్యారు నిందితులు .. వెంటనే ముంబై పోలీస్ పేరుతో ఒక ఫేక్ కాల్ చేశారు. తాము ముంబై పోలీస్ నని మీ మీద మనీలాండరింగ్ కింద కేసు నమోదు అయిందంటూ బాధితుడిని నమ్మించాడు. ఒక ఫేక్ వీడియో కాల్స్ సైతం బాధితుడికి చేసి అందులో ఫేక్ కాప్స్ మాదిరి బాధితుడిని భయపెట్టారు. చేసేది లేక స్థానిక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కేవలం అత్యాశకు పోయి సోషల్ మీడియాలో వీడియో చూసి తానే డబ్బులు పోగొట్టుకున్నట్టు ఉల్సూర్ పోలీసులను ఆశ్రయించాడు.

ఇవి కూడా చదవండి

బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నేరగాళ్ల ఫోన్ నెంబర్ కు కాల్ చేసి బెదిరించారు. దీంతో మరుసటి రోజు మళ్లీ బాధితుడికి ఫోన్ చేశారు సైబర్ నేరగాళ్లు.. తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమని, స్థానిక పోలీసులకు భయపడమని జనవరి 20 లోపు అరెస్టు చేస్తామని బాధితుడిని మళ్లీ భయభ్రాంతులకు గురి చేశారు.ఈ. ఉదంతం పై పోలీసులు కేస్ నమోదు. చేశారు.ఐటీ యాక్ట్ తో పాటు ipc 420 కింద కేస్ నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..