AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం..విమానం వాష్‌ రూమ్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు..తలుపు కింద నుంచి మెసేజ్..! 100 నిమిషాలు నరకయాతన..

విమానం మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరింది. సీటు నంబర్ 14డిలో కూర్చున్న ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌కి వెళ్లాడు. అతను బయటికి రావడానికి ప్రయత్నించాడు కానీ, ఫలితం లేకపోయింది..వాష్‌ రూమ్‌ గేట్‌ తెరుచుకోకపోవటంతో అతడు లోపలే ఇరుక్కుపోయాడు. సిబ్బంది కూడా తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ అవి కూడా ఫలించలేదు. ఇంతలో

పాపం..విమానం వాష్‌ రూమ్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు..తలుపు కింద నుంచి మెసేజ్..! 100 నిమిషాలు నరకయాతన..
Spicejet Flight
Jyothi Gadda
|

Updated on: Jan 18, 2024 | 7:18 AM

Share

విమానంలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. అనుకోకుండా అతడు విమానంలోని వాష్‌రూమ్‌లో ఇరుక్కుపోయాడు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అతడు ఎమర్జెన్సీ కోసం టాయిలెట్‌కి వెళ్లాడు.. అంతే..దురదృష్టవశాత్తు టాయిలెట్ డోర్ పనిచేయకపోవడంతో అతను లోపలే చిక్కుకుపోయాడు. అలాగే దాదాపు 100 నిమిషాల పాటు అతడు టాయిలెట్‌ లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు బెంగళూరు చేరుకున్న తర్వాత ఎలాగోలా తలుపులు పగలగొట్టి అతన్ని బయటకు తీశారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ముంబై నుండి బెంగళూరుకు స్పైస్ జెట్ ఫ్లైట్ నంబర్ SG-268 విమానంలో జరిగింది.

అందిన సమాచారం ప్రకారం, విమానం మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరింది. సీటు నంబర్ 14డిలో కూర్చున్న ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌కి వెళ్లాడు. అతను బయటికి రావడానికి ప్రయత్నించాడు కానీ, ఫలితం లేకపోయింది..వాష్‌ రూమ్‌ గేట్‌ తెరుచుకోకపోవటంతో అతడు లోపలే ఇరుక్కుపోయాడు. సిబ్బంది కూడా తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ అవి కూడా ఫలించలేదు. ఇంతలో ఎయిర్ హోస్టెస్ పేపర్ మీద మెసేజ్ రాసి అతడిని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేసింది. ‘ఇంకొంత సమయంలో విమానం ల్యాండ్ కానుంది’, ‘మీరు కమోడ్‌పై కూర్చోండి, విమానం గేటు తెరుచుకుంటుంది. టెక్నీషీయన్స్‌కి కాల్‌ చేశాం..వారు రెడీగా ఉన్నారు.. విమానం ల్యాండ్‌ అవగానే మీరు బయటకు వచ్చేస్తారు.. అని నోట్‌లో రాసి ఉంది.

మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు విమానం దిగింది. ఇంజనీర్లు వెంటనే విమానం ఎక్కారు. రెండు గంటలపాటు శ్రమించిన తర్వాత..ఇంజనీర్లు టాయిలెట్ తలుపును విజయవంతంగా తెరిచి, బాధిత వ్యక్తిని రక్షించారు. బాధిత ప్రయాణికుడికి ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ అతడు తీవ్ర ఆందోళనను భరించాడు. ప్రయాణికుడిని వెంటనే ప్రథమ చికిత్స కోసం తీసుకువెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణీకుడి వివరాలు తెలియరాలేదు మరియు స్పైస్‌జెట్ ఇంకా ఈ విషయంపై అధికారిక వ్యాఖ్యను అందించలేదు.

ఇదిలా ఉంటే, ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ముంబైకి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రయాణికులు నేలపై కూర్చొని భోజనం చేస్తున్న దృశ్యాలు అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. అది కూడా రాత్రి సమయం కావడంతో కొందరు ఫ్లైట్ దగ్గర కూర్చుని భోజనం చేయడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు, విమాన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..