యజమానిని పరుగులు పెట్టించిన పెద్దపులి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇదేంటి.. యజమాని అంటున్నారు..! అనుకుంటున్నారా? అవును అదొక పెంపుడు పులి. మీరు విన్నది నిజమే.. ఈమధ్య కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచుకుంటున్నట్టే క్రూరమృగాలను కూడా పెట్స్‌గా మార్చేస్తున్నారు జంతు ప్రేమికులు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ దేశానికి చెందినవారి విలాసవంతమైన జీవితాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడీయాలో చాలానే చూసి ఉంటాం. అక్కడి సంపన్న వర్గానికి చెందిన వారు చాలా వరకు.. పులులు, సింహాలు, చీతాలను పెంచుకోవటం గొప్పగా భావిస్తారు.
ఇదేంటి.. యజమాని అంటున్నారు..! అనుకుంటున్నారా? అవును అదొక పెంపుడు పులి. మీరు విన్నది నిజమే.. ఈమధ్య కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచుకుంటున్నట్టే క్రూరమృగాలను కూడా పెట్స్‌గా మార్చేస్తున్నారు జంతు ప్రేమికులు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ దేశానికి చెందినవారి విలాసవంతమైన జీవితాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడీయాలో చాలానే చూసి ఉంటాం. అక్కడి సంపన్న వర్గానికి చెందిన వారు చాలా వరకు.. పులులు, సింహాలు, చీతాలను పెంచుకోవటం గొప్పగా భావిస్తారు. అటువంటి జంతువుల కలెక్షన్ వాటిని బీచ్‌లకు తీసుకువెళ్లడం యూఏఈ సంపన్న కుటుంబాలలో సర్వసాధారణం. అయితే తాజాగా ఓ విలాసవంతమైన భవనంలో ఒక పెంపుడు పులి.. ఓ వ్యక్తిని భయంతో పరుగులు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లగ్జరీ భవంతిలోని హాల్‌లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారితోపాటే ఓ పెద్దపులి కూడా ఉంది. ఉన్నట్టుండి ఆ పులి ఓ వ్యక్తి వెంటపడింది. అతన్ని పరుగులు పెట్టించింది. మొదట.. ఆటగానే భావించి పులితో కాసేపు ఆడుకున్నాడు ఆ వ్యక్తి. అయితే ఒక్కసారిగా పులి వేగంపెంచి అతనిపైకి దూసుకెళ్లింది. దెబ్బకు భయంతో పరుగులు పెట్టాడు ఆ వ్యక్తి . కానీ ఆ పులి అతణ్ణి ఏమీ చేయలేదు. ఆటలో భాగంగానే తన యజమానిని భయపెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జనవరి 22 వరకు అయోధ్య రూట్‌లో వెళ్లే రైళ్లు రద్దు
‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు పెరిగిన డిమాండ్.. ప్రింట్ చేయలేక చేతులెత్తేసిన ప్రెస్
ధ్వనివేగానికి మించి ప్రయాణించే విమానం.. నాసా ఆవిష్కరణ..