‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు పెరిగిన డిమాండ్‌.. ప్రింట్‌ చేయలేక చేతులెత్తేసిన ప్రెస్‌

‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు పెరిగిన డిమాండ్‌.. ప్రింట్‌ చేయలేక చేతులెత్తేసిన ప్రెస్‌

Phani CH

|

Updated on: Jan 17, 2024 | 8:43 PM

ఆసేతుహిమాచలం రామనామ స్మరణలో మునిగిపోయింది. ఏనోట విన్నా అయోధ్య రాముని నామమే.. ఏచోట చూసినా భవ్యరామమందిర ప్రారంభోత్సవ చర్చే.. మరో ఐదు రోజుల్లో ఆ దివ్యభవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఆలయంలో కొలువుతీరనున్న బాలరాముడి విగ్రహం సైతం సిద్ధమైంది. అలాగే దేశవ్యాప్తంగా రామభక్తులు శ్రీరామాయణం, రామచరితమానస్‌, హనుమాన్‌ చాలీసా పఠనంతో భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు.

ఆసేతుహిమాచలం రామనామ స్మరణలో మునిగిపోయింది. ఏనోట విన్నా అయోధ్య రాముని నామమే.. ఏచోట చూసినా భవ్యరామమందిర ప్రారంభోత్సవ చర్చే.. మరో ఐదు రోజుల్లో ఆ దివ్యభవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఆలయంలో కొలువుతీరనున్న బాలరాముడి విగ్రహం సైతం సిద్ధమైంది. అలాగే దేశవ్యాప్తంగా రామభక్తులు శ్రీరామాయణం, రామచరితమానస్‌, హనుమాన్‌ చాలీసా పఠనంతో భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో శ్రీరామ్‌చరిత్‌మానస్‌ పుస్తకాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దాంతో ఈ పుస్తకాలు ప్రింట్‌ చేసే గీతా ప్రెస్‌ పుస్తకాలు ప్రింట్‌ చేయలేక చేతులెత్తేసింది. గాంధీ శాంతి బహుమతి ప్రకటించడంతో వెలుగులోకి వచ్చిన గోరఖ్‌పూర్‌లోని భారతీయ పుస్తక ప్రచురణ సంస్థ గీతా ప్రెస్ నుంచి వెలువడే ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు ఒక్కసారిగా విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో, ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ధ్వనివేగానికి మించి ప్రయాణించే విమానం.. నాసా ఆవిష్కరణ..

చొక్కా మడతెట్టిన రోబో.. వీడియో ఇదిగో

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

అయోధ్యరాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల అగరుబత్తి

ఇది అల్లాటప్పా బ్యాగు కాదు.. దీని ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు