AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది అల్లాటప్పా బ్యాగు కాదు.. దీని ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు

ఇది అల్లాటప్పా బ్యాగు కాదు.. దీని ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు

Phani CH
|

Updated on: Jan 17, 2024 | 8:35 PM

Share

కొన్ని లగ్జరీ కంపెనీలకు చెందిన వస్తువుల ధరలు తెలిస్తే ఔరా అనేలా ఉంటాయి. అప్పుడప్పుడు సెలబ్రిటీలు ధరించే దుస్తులు, ఉపయోగించే ఇతర సామగ్రి ధరలు భారీగా ఉంటాయి. నిజానికి ఆ వస్తువులను చూసినప్పుడు అంత ధర పలకడానికి అందులో ఏముందనే సందేహం రాకమానదు. తాజాగా అలాంటి ఓ వస్తువు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న బ్యాగ్ చూస్తే ఓ కాగితం కవరులా ఉంది కదూ.

కొన్ని లగ్జరీ కంపెనీలకు చెందిన వస్తువుల ధరలు తెలిస్తే ఔరా అనేలా ఉంటాయి. అప్పుడప్పుడు సెలబ్రిటీలు ధరించే దుస్తులు, ఉపయోగించే ఇతర సామగ్రి ధరలు భారీగా ఉంటాయి. నిజానికి ఆ వస్తువులను చూసినప్పుడు అంత ధర పలకడానికి అందులో ఏముందనే సందేహం రాకమానదు. తాజాగా అలాంటి ఓ వస్తువు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న బ్యాగ్ చూస్తే ఓ కాగితం కవరులా ఉంది కదూ. ఈ బ్యాగ్‌ ధర మహా అయితే ఓ వంద రూపాయాలు ఉంటుంది, మరీ ఎక్కువ అంటే వెయ్యి రూపాయాలు ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ బ్యాగ్‌ ధర అక్షరాల 2,80,000 రూపాయలు. అవును.. లగ్జరీ ఫ్యాషన్‌ కంపెనీ లూయిస్‌ విట్టన్‌ తయారు చేసిన ఈ బ్యాగ్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఈ బ్యాగుపై లూయిస్ విట్టన్, మైసన్ ఫాండీ ఎన్ 1854 అని రాసి ఉంటుంది. లోపల జిప్డ్‌ పాకెట్‌, డబుల్‌ ఫ్లాట్‌ పాకెట్‌ను అందించారు. మెన్స్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఫారెల్‌ విలియమ్స్‌ దీన్ని రూపొందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్తగారింట్లో కొత్త అల్లుడి మర్యాదలు.. ఏకంగా 300 రకాల పిండివంటలతో

తెలుగు నేలపైనే శ్రీరాముని ప్రాణప్రతిష్ట యంత్రం తయారీ

3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే విమానం రద్దు

రన్‌‌వేపై డిన్నర్.. ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ

ఆ ఆలయంలో రాచగుమ్మడి రహస్యం !! ఒక్క గుమ్మడికాయతో కోరికలు తీర్చే వీరభధ్రుడు