అత్తగారింట్లో కొత్త అల్లుడి మర్యాదలు.. ఏకంగా 300 రకాల పిండివంటలతో

అత్తగారింట్లో కొత్త అల్లుడి మర్యాదలు.. ఏకంగా 300 రకాల పిండివంటలతో

|

Updated on: Jan 17, 2024 | 8:32 PM

సంక్రాంతి అంటేనే కోనసీమ జిల్లాల్లో జరిగే సందడే వేరు. కొత్త ధాన్యాలతో, కోడిపందాలతో పల్లెలన్నీ సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. ఇక సంక్రాంతికి మరో స్పెషల్‌ కొత్త అల్లుళ్లు.. మరదళ్ల సందడి. కొత్తగా ఇంటికొచ్చిన బావగారిని మరదళ్లు ఆటపట్టించడం.. ఆ తర్వాత అతిథి సత్కారాలతో అలరించడం ఓ రేంజ్‌లో ఉంటుంది. అలా సంక్రాంతికి కొత్తగా తమ ఇంటికి వచ్చిన అల్లుడుగారికి ఈ సారి కొంగొత్తగా అత్తగారు దగ్గరుండి మరీ కొసరి కొసరి స్వీట్లు తినిపించారు.

సంక్రాంతి అంటేనే కోనసీమ జిల్లాల్లో జరిగే సందడే వేరు. కొత్త ధాన్యాలతో, కోడిపందాలతో పల్లెలన్నీ సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. ఇక సంక్రాంతికి మరో స్పెషల్‌ కొత్త అల్లుళ్లు.. మరదళ్ల సందడి. కొత్తగా ఇంటికొచ్చిన బావగారిని మరదళ్లు ఆటపట్టించడం.. ఆ తర్వాత అతిథి సత్కారాలతో అలరించడం ఓ రేంజ్‌లో ఉంటుంది. అలా సంక్రాంతికి కొత్తగా తమ ఇంటికి వచ్చిన అల్లుడుగారికి ఈ సారి కొంగొత్తగా అత్తగారు దగ్గరుండి మరీ కొసరి కొసరి స్వీట్లు తినిపించారు. అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషిత కు విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్ తో గత డిసెంబర్లో వివాహం జరిగింది. నవ దంపతులను మొదటి పండగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానించారు. కొత్త అల్లుడికి రాచ మర్యాదలు సహజమైనప్పటికీ. తమ స్టైల్ లో రకరకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు. బావగారిని కారు దగ్గరకు వెళ్లి బావమరిది స్వయంగా కారు డోరు తెరిచి స్వాగతం చెప్పగా.. అత్తమామలు,ఇతర బంధువులు పూలు చల్లి ఆహ్వానం పలికారు. ఇక కొత్తగా జీవితంలోకి అడుగుపెట్టిన సతీమణి మరోసారి వరమాలవేసి వెల్కమ్‌ చెప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు నేలపైనే శ్రీరాముని ప్రాణప్రతిష్ట యంత్రం తయారీ

3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే విమానం రద్దు

రన్‌‌వేపై డిన్నర్.. ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ

ఆ ఆలయంలో రాచగుమ్మడి రహస్యం !! ఒక్క గుమ్మడికాయతో కోరికలు తీర్చే వీరభధ్రుడు

అయోధ్య రామయ్యకు అతిపొడవైన అగర్‌ బత్తి

Follow us