3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే విమానం రద్దు

3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే విమానం రద్దు

|

Updated on: Jan 17, 2024 | 8:30 PM

విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రంగంలోకి దిగింది. సోమవారం కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను (SOP) జారీ చేసింది. విమాన సర్వీసు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ విమానాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు డీజీసీఏ వీలు కల్పించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రంగంలోకి దిగింది. సోమవారం కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను (SOP) జారీ చేసింది. విమాన సర్వీసు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ విమానాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు డీజీసీఏ వీలు కల్పించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల వద్ద రద్దీ నియంత్రణ, ప్రయాణికులకు వీలైనంతగా అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డీజీసీఏ దీనిని రూపొందించింది. అయితే విమానం రద్దయితే ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బోర్డింగ్‌ల తిరస్కరణ, విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేని జాప్యాల సందర్భాల్లోనూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది. కొత్త మార్గదర్శకాలలో భాగంగా విమాన టిక్కెట్లపై సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్‌ను ముద్రిస్తారు. ఈ మార్గదర్శకాలను విమానయాన సంస్థలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్‌‌వేపై డిన్నర్.. ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ

ఆ ఆలయంలో రాచగుమ్మడి రహస్యం !! ఒక్క గుమ్మడికాయతో కోరికలు తీర్చే వీరభధ్రుడు

అయోధ్య రామయ్యకు అతిపొడవైన అగర్‌ బత్తి

Follow us