రన్‌వేపై డిన్నర్.. ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ
ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో విమానం పక్కనే రన్‌వేపై కూర్చొని ప్రయాణికులు డిన్నర్ చేసిన ఘటనపై దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో స్పందించింది. ప్రయాణికులను క్షమాపణలు కోరింది. రన్‌వేపై కూర్చొని ప్యాసింజర్లు ఇబ్బందికరంగా భోజనం చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇండిగో దిగొచ్చింది. క్షమాపణ కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో విమానం పక్కనే రన్‌వేపై కూర్చొని ప్రయాణికులు డిన్నర్ చేసిన ఘటనపై దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో స్పందించింది. ప్రయాణికులను క్షమాపణలు కోరింది. రన్‌వేపై కూర్చొని ప్యాసింజర్లు ఇబ్బందికరంగా భోజనం చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇండిగో దిగొచ్చింది. క్షమాపణ కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, నిరంతరాయంగా సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. కాగా జనవరి 14న గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై మళ్లించారు. ప్రయాణికులు అక్కడ చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో వారికి రన్‌వేపైనే భోజనాన్ని ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఆలయంలో రాచగుమ్మడి రహస్యం !! ఒక్క గుమ్మడికాయతో కోరికలు తీర్చే వీరభధ్రుడు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

