ధ్వనివేగానికి మించి ప్రయాణించే విమానం.. నాసా ఆవిష్కరణ..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. వాణిజ్య పరంగా సూపర్‌సోనిక్ ప్రయాణాన్ని ఆరంభించే లక్ష్యంతో శుక్రవారం నిశ్శబ్దంగా ప్రయాణించే సూపర్‌సోనిక్ విమానాన్ని ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని పామ్‌డేల్‌లో లాక్‌హాడ్ మార్టిన్ స్కంక్ వర్క్స్‌తో కలిసి నాసా ఈ ప్రయోగాత్మక విమానాన్ని ఆవిష్కరించింది. ఈ విమాన గరిష్ఠ వేగం ధ్వనికంటే 1.4 రెట్లు అధికం. అంటే గంటకు 1,488 కిలోమీటర్లు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. వాణిజ్య పరంగా సూపర్‌సోనిక్ ప్రయాణాన్ని ఆరంభించే లక్ష్యంతో శుక్రవారం నిశ్శబ్దంగా ప్రయాణించే సూపర్‌సోనిక్ విమానాన్ని ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని పామ్‌డేల్‌లో లాక్‌హాడ్ మార్టిన్ స్కంక్ వర్క్స్‌తో కలిసి నాసా ఈ ప్రయోగాత్మక విమానాన్ని ఆవిష్కరించింది. ఈ విమాన గరిష్ఠ వేగం ధ్వనికంటే 1.4 రెట్లు అధికం. అంటే గంటకు 1,488 కిలోమీటర్లు. ఈ ఏడాది చివర్లో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నిశ్శబ్ద సూపర్ సోనిక్ విమానం. సన్నగా ఉండే ఎక్స్-59 ముక్కు దాని మొత్తం పొడవులో మూడింట ఒక వంతు ఉంది. దీనివల్ల సోనిక్ బూమ్స్‌కు కారణమయ్యే షాక్ తరంగాలను తిప్పికొట్టేందుకు ఉపయోగపడుతుంది. విమానం మొత్తం పొడవు 99.7 అడుగులు కాగా, వెడల్పు 29.5 అడుగులు. విమానం సూపర్ సోనిక్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సాధారణ విమానాల్లో ఉండే ఫార్వర్డ్-ఫేసింగ్ కిటికీలను తొలగించారు. అతి తక్కువ కాలంలోనే దీనిని అభివృద్ధి చేసి టేకాఫ్ కు సిద్ధం చేసినట్టు నాసా తెలిపింది. ఎక్స్-59తో ప్రయాణ గమనమే మారిపోతుందని పేర్కొంది.
రిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చొక్కా మడతెట్టిన రోబో.. వీడియో ఇదిగో
అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
అయోధ్యరాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల అగరుబత్తి
ఇది అల్లాటప్పా బ్యాగు కాదు.. దీని ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు
అత్తగారింట్లో కొత్త అల్లుడి మర్యాదలు.. ఏకంగా 300 రకాల పిండివంటలతో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

