Hyderabad Trains: ప్రయాణీకులకు అలెర్ట్.. హైదరాబాద్ నుంచి బయలుదేరే ఆ రైలు రద్దు.. వాటి టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసే రైల్వే ప్రయాణికులకు అధికారులు కీలక ప్రకటన చేశారు. పలు రైళ్ల సమయాల్లో మార్పులతో పాటు, ఓ రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో ప్రధానమైంది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. వీటితో పాటు పలు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేశారు..

* హైదరాబాద్ న్యూఢిల్లీల మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 12723 తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 19వ తేదీన (శుక్రవారం) ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైలుకు అనుసంధానంగా నడిచే పేరింగ్ ట్రైన్ ఆలస్యం కారణంగానే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
* హైదరాబాద్ నుంచి తంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలును రీషెడ్యూల్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రెన్ నెంబర్ 12760 హైదరాబాద్ – తంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చేశారు. జవనరి 18వ తేదీ (గురువారం) హైదరాబాద్ నుంచి 18.00 గంటలకు బయలుదేరాల్సిన రైలు గంట ఆలస్యంగా అంటే 19.00 గంటలకు బయలు దేరనున్నట్లు అధికారులు ప్రకటించారు.
* హైదరాబాద్ నుంచి బిహార్‌లోని రక్సాల్‌కు వెళ్లే రైలు ప్రయాణ సమయంలో మార్పు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రెన్ నెంబర్ 17005 హైదరాబాద్ – రాక్సాల్ ఎక్స్‌ప్రెస్.. గురువారం 23.10 గంటలకు బయలు దేరాల్సి ఉండగా, శుక్రవారం 01.10 గంటలకు రీషెడ్యూల్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..