AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సింగరేణి ఏరియాలో కలకలం.. అనుమానస్పద స్థితిలో ఇద్దరు యువకులు మృతి!

కల్లు సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. గోదావరిఖని ఆర్యవైశ్య భవన్ సమీపంలో నిన్న రాత్రి ఒక్కరొక్కరుగా ఇద్దరు యువకులు కుప్పకూలి దుర్మరణం పాలయ్యారు. కల్లు మత్తులో ఇద్దరు కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో తొలుతగా రమేష్ అనే యువకుడు కుప్పకూలి కింద..

Telangana: సింగరేణి ఏరియాలో కలకలం.. అనుమానస్పద స్థితిలో ఇద్దరు యువకులు మృతి!
Kalti Kallu
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 18, 2024 | 4:27 PM

Share

సింగరేణి, జనవరి 18: కల్లు సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. గోదావరిఖని ఆర్యవైశ్య భవన్ సమీపంలో నిన్న రాత్రి ఒక్కరొక్కరుగా ఇద్దరు యువకులు కుప్పకూలి దుర్మరణం పాలయ్యారు. కల్లు మత్తులో ఇద్దరు కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో తొలుతగా రమేష్ అనే యువకుడు కుప్పకూలి కింద పడిపోయాడు. అతన్ని పైకెత్తి భుజాన వేసుకునే ప్రయత్నంలో నవీన్ అనే మరో యువకుడు కూడా కుప్పకూలి కింద పడిపోయాడు. స్థానికులు వీరిరువురిని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించగా, వారు అప్పటికే మృతి చెందినట్లు హాస్పిటల్ వైద్యులు ధ్రువీకరించారు. మృతులు ఇద్దరు మేస్త్రి పని చేసేవారుగా తెలియ వచ్చింది.

ఇద్దరు కలిసి బుధవారం అడ్డగుంటపల్లిలోని ఓ ఇంటి నిర్మాణ పనులను నిర్వర్తించారు. పని పూర్తయిన అనంతరం సమీపంలోని దుకాణంలో ఇద్దరు కలిసి కళ్ళు సేవించినట్లు తెలిసింది. ఐతే, వీరు సేవించిన కల్లులో కల్తీ జరగడం వల్లే ఇద్దరు చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మృతులిద్దరూ నవీన్, రమేష్ ప్రాణ స్నేహితులు. ఈ ఇద్దరు తాపీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం పని ముగుంచుకుని ఇంటికి వెళ్లే క్రమంలో అడ్డగుంటపల్లిలోని నంబర్ వన్ కల్లు డిపోలో ఇద్దరు కలిసి కల్లు తాగారు. అనంతరం నవీన్, రమేష్ నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు. ఆర్యవైశ్య నగర్ రాగానే రమేష్ కుప్పకూలాడు. వెంటనే నవీన్ కంగారుపడి, రమేష్‌ను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అనంతరం నవీన్ కూడా తీవ్ర అస్వస్థతతో కిందపడిపోయాడు.

చుట్టుపక్కల స్థానికులు గమనించి వీరిద్దరినీ గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద షాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని, కళ్ళు దుకాణాన్ని సీజ్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం, వీరి మృతికి గల కారణాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.