Cleaning Tips: మీ వంటింట్లో కుళాయి తుప్పు పట్టిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి.. కొత్తగా మెరుస్తాయి..!

సాధారణంగా మనం వంటగదిలోని కుళాయిని ఎక్కువగా ఉపయోగిస్తాము. దీనివల్ల కుళాయిలపై ఉప్పునీరు, తుప్పు, మురికి మరకలు పేరుకుపోతుంటాయి. వాటిని వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా శుభ్రంగా మారవు. ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ మరకలను తొలగించడానికి ఖరీదైన ఉత్పత్తులను వాడుతూ చాలా మంది డబ్బు ఖర్చు చేసుకుంటారు. అటువంటి సందర్భాలలో మీరు కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి మీ ఇంట్లోని కుళాయిలను శుభ్రం చేసుకోవచ్చు. అలాగే, పైపుల్లోంచి నీరు కూడా ధారళంగా వచ్చేలా చేసుకోచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...

| Edited By: Ravi Kiran

Updated on: Jul 10, 2024 | 6:16 AM

వైట్ వెనిగర్: కుళాయిలపై పేరుకుపోయిన మరకలు, ఉప్పు నీటి మరకలు, మురికిన తొలగించడానికి వైట్ వెనిగర్ ఉపయోగించవచ్చు. దీని కోసం, స్ప్రే బాటిల్‌లో వైట్ వెనిగర్ నింపి, ఆపై దానిని కుళాయి గొట్టాలపై స్ప్రె చేయండి. కుళాయిని కొంత సమయం పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్ లేదా స్క్రబ్బర్ తీసుకుని స్క్రబ్ చేయండి. దీని తరువాత, ఒక గుడ్డతో కుళాయిని శుభ్రంగా తుడిచేయండి.. ఇలా చేయడం వల్ల కుళాయిపై ఉన్న మరకలు తొలగిపోయి, కుళాయి కొత్తగా కనిపిస్తుంది.

1 / 5
బేకింగ్ సోడా-నిమ్మకాయ: మరకలను తొలగించడానికి మీరు బేకింగ్ సోడా, నిమ్మకాయ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని, అందులో సగం నిమ్మకాయ రసం కలిపి పేస్ట్ లా చేయాలి. తర్వాత కుళాయి చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచండి. చివరగా స్క్రబ్ చేసి, చివరకు శుభ్రమైన నీటితో కడిగేయండి.

2 / 5
టమాటో సాస్: మీరు టమాటో సాస్ కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, రెండు-మూడు చెంచాల టమాటో సాస్‌ను తీసుకుని, కుళాయిపై దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా రాయండి. ఆపై కొంత సమయం పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు కుళాయిని బ్రష్ తో రుద్ది పొడి గుడ్డతో తుడవడం వల్ల కుళాయి మీద ఉన్న మురికి అంతా పోతుంది.

3 / 5
నిమ్మరసం: మీరు కుళాయిల నుండి నీరు లేదా మురికి మరకలను తొలగించడానికి నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం మూడు లేదా నాలుగు నిమ్మకాయలను పిండుకుని రసం తీయాలి. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని కుళాయిపై స్ప్రే చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత పాత టూత్ బ్రష్ తో స్క్రబ్ చేసి కాటన్ క్లాత్ తో తుడవండి. ఇలా చేయడం వల్ల కొద్ది నిమిషాల్లోనే కుళాయి మెరుస్తుంది.

4 / 5
హైడ్రోజన్ పెరాక్సైడ్: ఉప్పునీరు, ధూళి లేదా తుప్పు మరకలను తొలగించడానికి మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉపయోగించవచ్చు. దీని కోసం, రెండు నుండి మూడు టీస్పూన్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ను బ్రష్ సహాయంతో కుళాయిలో వేయండి. తర్వాత అరగంట అలాగే ఉంచి పాత టూత్ బ్రష్ సహాయంతో మరకను తొలగించండి. దీంతో మురికి కుళాయిలు కూడా కొత్తవిగా కనిపిస్తాయి.

5 / 5
Follow us