- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu, Rajamouli Movie Set To Start In Grand Venture, Script Locked
Mahesh Babu: రాజమౌళి కోసం మహేష్ బాబు మాస్టర్ ప్లాన్!
మరో మూడేళ్ల వరకు మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపించరని అభిమానులు కూడా ముందుగానే ఫిక్సైపోయారు.. ఇండస్ట్రీలోనూ ఇదే టాక్ నడుస్తుంది. గతంలో ఒకే సినిమా కోసం మహేష్ ఇంత టైమ్ ఎప్పుడూ ఇచ్చింది లేదు. మరి దీన్ని ఆయనెలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? వెకేషన్స్ వెళ్తారా.. మునపటిలా యాడ్స్ చేస్తారా..? అసలు వీటన్నింటికీ రాజమౌళి ఓకే చెప్తారా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్.. రాజమౌళితో సినిమా అనగానే అదేదో తమ హీరోలు జైలుకు వెళ్తున్నారనే రేంజ్‌లో బాధ పడిపోతుంటారు అభిమానులు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jan 17, 2024 | 6:26 PM

మరో మూడేళ్ల వరకు మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపించరని అభిమానులు కూడా ముందుగానే ఫిక్సైపోయారు.. ఇండస్ట్రీలోనూ ఇదే టాక్ నడుస్తుంది. గతంలో ఒకే సినిమా కోసం మహేష్ ఇంత టైమ్ ఎప్పుడూ ఇచ్చింది లేదు. మరి దీన్ని ఆయనెలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? వెకేషన్స్ వెళ్తారా.. మునపటిలా యాడ్స్ చేస్తారా..? అసలు వీటన్నింటికీ రాజమౌళి ఓకే చెప్తారా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్..

రాజమౌళితో సినిమా అనగానే అదేదో తమ హీరోలు జైలుకు వెళ్తున్నారనే రేంజ్‌లో బాధ పడిపోతుంటారు అభిమానులు. ఓ వైపు మా వాడి మార్కెట్ పెరుగుతుంది.. పాన్ ఇండియన్ స్టార్ అవుతాడనే ఆనందం ఉన్నా.. మూడేళ్ల వరకు సినిమాలు రావనే బాధ కూడా ఉంటుంది. మహేష్ బాబు అభిమానుల్లోనూ అదే కనిపిస్తుందిప్పుడు. అందుకే గుంటూరు కారాన్ని ఆస్వాదిస్తున్నారిప్పుడు.

ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. మహేష్ బాబు వర్కింగ్ స్టైల్‌తో పోలిస్తే రాజమౌళి వర్కింగ్ బాగా డిఫెరెంట్. ఒక్కసారి సినిమా మొదలుపెట్టాక సెట్‌నే జైల్లా మార్చేస్తుంటారు జక్కన్న. కానీ మహేష్ అలా కాదు.. ఓ షెడ్యూల్ అవ్వగానే ఫ్యామిలీతో పాటు వెకేషన్ వెళ్లొద్దాం.. కుదిర్తే ఓ యాడ్ చేసేద్దాం అనుకుంటారు. ఈ ఇద్దరూ ఎలా కలుస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

తల్లీ బిడ్డ న్యాయం అన్నట్లు.. సినిమా డిస్టర్బ్ కాకుండా.. తన అలవాటు మార్చుకోకుండా రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేసారని తెలుస్తుంది. ఏడాదిలో 8 నెలలు షూటింగ్.. 2 నెలలు వెకేషన్స్.. ఓ నెల యాడ్స్ చేయాలని మహేష్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ ప్లానింగ్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది.

సాధారణంగా రాజమౌళితో సినిమా మొదలుపెట్టాక హీరోలకు ఇంకే ధ్యాస ఉండదు.. అలా ఉండే ఛాన్స్ కూడా ఇవ్వరు దర్శక ధీరుడు. మరి మహేష్ బాబుకు మాత్రమే అలాంటి ఆఫర్ ఇస్తారా అనేది ఆసక్తికరమే. 2024 సెకండ్ హాఫ్‌లో SSMB29 మొదలు కానుంది. ఎలా చూసుకున్నా కచ్చితంగా 2026 చివర్లో లేదంటే 2027లోనే ఈ సినిమా రానుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?





























