- Telugu News Photo Gallery Cinema photos God Related Scripts Key Aim For Tollywood Heroes, Details Here
అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటున్న హీరోలు
అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటారు కదా.. ఇప్పుడిదే జరుగుతుంది. ఒక్కరో ఇద్దరో కాదు.. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా దేవుడి పైనే భారం వేస్తున్నారు. మైథలాజికల్ సబ్జెక్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరహా దేవుడి కథలకు డిమాండ్ కూడా బాగానే ఉందిప్పుడు. అందుకే అంతా అదే దారిలో వెళ్తున్నారు. చూస్తున్నారుగా చిరంజీవి కొత్త సినిమా టైటిల్ టీజర్..! ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పెడుతున్నట్లు గతంలోనే మనం చెప్పుకున్నాం.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jan 17, 2024 | 6:45 PM

అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటారు కదా.. ఇప్పుడిదే జరుగుతుంది. ఒక్కరో ఇద్దరో కాదు.. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా దేవుడి పైనే భారం వేస్తున్నారు. మైథలాజికల్ సబ్జెక్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరహా దేవుడి కథలకు డిమాండ్ కూడా బాగానే ఉందిప్పుడు. అందుకే అంతా అదే దారిలో వెళ్తున్నారు.

లేకుంటే, మెగాస్టార్‌కి సెంటిమెంట్‌లు ఉండవా.. కాసేపు ఈ విషయాలను పక్కనపెడితే, ఆయన నెక్స్ట్ సినిమాలో త్రిష నటిస్తున్నారన్నది కన్‌ఫర్మ్డ్ న్యూస్. విశ్వంభరలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు చెన్నై సోయగం.

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే కచ్చితంగా 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా క్లైమాక్స్‌లో హనుమాన్ ఎంట్రీకి థియేటర్స్ అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి. రెండేళ్ల కింద కార్తికేయ 2తో కృష్ణుడు కూడా ఇలాగే బాక్సాఫీస్ దగ్గర మాయ చేసాడు.

నిఖిల్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2తో కృష్ణుడి రిఫరెన్స్ తీసుకున్నారు. ఈ చిత్రం 120 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే అఖండలో బాలయ్య శివుడి అంశగా కనిపించారు. అది కూడా బాక్సాఫీస్‌పై విరుచుకుపడింది. ఒక్క ఆదిపురుష్ తప్ప.. ఈ మధ్య దేవుడి కాన్సెప్ట్ ఏది తీసుకున్నా కూడా వసూళ్ల వర్షం కురిపించింది.





























