The Raja Saab: ప్రభాస్‌ను అలా చూపించాలని ఫిక్సైపోయిన మారుతి
ప్రభాస్ సినిమా అంటే చాలు.. అయితే యాక్షన్ లేదంటే ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్‌తో నింపేస్తున్నారు దర్శకులు. ఆయన్ని అలా చూపించడానికే ఫిక్సైపోయారు మేకర్స్. ఈ హడావిడిలో పడి అసలు ప్రభాస్‌లో ఓ డార్లింగ్ దాగి ఉన్నాడనే విషయమే మరిచిపోయారు వాళ్లు. మరి మారుతి అయినా దీన్ని గుర్తు చేస్తాడా.. అసలు రాజా సాబ్ ఎలా ఉండబోతుంది..? ప్రభాస్‌ను ఇలాంటి డార్లింగ్ రోల్‌లో మరోసారి చూడాలని కలలు కంటున్నారు ఫ్యాన్స్. కానీ వాళ్ల కలలు ఇప్పుడు నెరవేరడం కష్టమే. ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియన్ ఇమేజే దీనికి అడ్డు. ఆయనపై ఇలాంటి సాఫ్ట్ స్టోరీస్ వర్కవుట్ అవ్వవు. అందుకే అయితే విజువల్ వండర్స్ లేదంటే యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు దర్శకులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
